Kumaram Bheem Asifabad: ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Dec 26 , 2023 | 10:07 PM
ఉచిత ఆరోగ్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు.
కాగజ్‌నగర్, డిసెంబరు 26: ఉచిత ఆరోగ్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సోమవారం కాగజ్‌నగర్ బాలభారతి పాఠశాలలో సీఎస్‌సీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరోగ్య శిబిరాల్లో అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో సీఎస్‌సీ హెల్త్ కేర్ సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ చైర్మన్
కాగజ్‌నగర్, డిసెంబరు 26: సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబును తన నివాసంలో కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ సద్దాంహుస్సేన్ సోమవారం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పట్టణంలో నెలకొన్న వివిధ అంశాలు, సమస్యలపై చర్చించారు. అనంతరం పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మధూకర్, రాష్ట్ర కార్యదర్శి మామిడాల తిరుపతి, జిల్లా గౌరవ అ ధ్యక్షులు పార్వతి రాజేశ్వర్‌రావు, జిల్లా అధ్యక్షులు తౌటం శ్యాం సుం దర్ తదితరులు కలిసి సన్మానించారు. స్థానిక భాలభారతి పాఠశాలలలో సిబ్బంది, మేనేజ్‌మెంటు సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు.
Updated Date - Dec 26 , 2023 | 10:07 PM