ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సూర్యాపేట టికెట్‌ దామోదర్‌రెడ్డికే

ABN, First Publish Date - 2023-11-10T04:41:12+05:30

అయిదు స్థానాలకు అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ తుది జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఎట్టకేలకు పటాన్‌చెరు స్థానానికి కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ పేరును ఖరారు చేశారు.

ఐదు స్థానాలతో కాంగ్రెస్‌ తుది జాబితా

పటాన్‌చెరు - కాటా శ్రీనివాస్‌గౌడ్‌

సూర్యాపేట -రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

తుంగతుర్తి - మందుల సామేల్‌

మిర్యాలగూడ - బత్తుల లక్ష్మారెడ్డి

చార్మినార్‌ - ముజీబుల్లా షరీఫ్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): అయిదు స్థానాలకు అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ తుది జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఎట్టకేలకు పటాన్‌చెరు స్థానానికి కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ పేరును ఖరారు చేశారు. మొదట ఈ స్థానానికి నీలం మధు ముదిరాజ్‌ పేరును ప్రకటించడంతో వివాదం నెలకొంది. దీంతో అధిష్ఠానం పరిస్థితిని సమీక్షించి శ్రీనివాస్‌ గౌడ్‌ పేరును ప్రకటించింది. సూర్యాపేట నుంచి పటేల్‌ రమేశ్‌ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి పేరును ఖరారు చేసింది. తుంగతుర్తి టికెట్‌ కోసం అద్దంకి దయాకర్‌, పిడమర్తి రవి, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు తీవ్రంగా ప్రయత్నించినా అనూహ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అనుయాయుడైన మందుల సామ్యూల్‌ను ఎంపిక చేశారు. సీపీఎంతో పొత్తు కుదరదని తేలిపోవడంతో మిర్యాలగూడ సీటుకు బత్తుల లక్ష్మారెడ్డిని ఖరారు చేసింది. చార్మినార్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మహ్మద్‌ ముజీబుల్లా షరీఫ్‌ ఎంపికయ్యారు. మజ్లిస్‌ అసమ్మతి నేత, సిటింగ్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ ఖాన్‌ చార్మినార్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తారని భావించినా ఆయన పార్టీలో చేరకపోవడంతో సీనియర్‌ నేత షరీ్‌ఫను ఖరారు చేశారు.

Updated Date - 2023-11-10T04:41:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising