విద్యార్థులు చదువుతూ మార్పు కోసం పోరాడాలి
ABN, Publish Date - Dec 31 , 2023 | 11:12 PM
చదువుతో పాటు విద్యార్థులు సమాజ మార్పు కోసం పోరాడాల్సిన అవసరం ఉందని మునిసిపల్ మాజీ వైస్ చైర్మన డబ్బీకార్ మల్లే ష్ అన్నారు.
విద్యార్థులు చదువుతూ మార్పు కోసం పోరాడాలి
ఎస్‌ఎ్‌ఫఐ ఆవిర్భావ సభలో డబ్బీకార్ మల్లేష్
మిర్యాలగూడ, డిసెంబరు 31: చదువుతో పాటు విద్యార్థులు సమాజ మార్పు కోసం పోరాడాల్సిన అవసరం ఉందని మునిసిపల్ మాజీ వైస్ చైర్మన డబ్బీకార్ మల్లే ష్ అన్నారు. ఎస్‌ఎ్‌ఫఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్‌లో క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 54 ఏళ్లుగా అధ్యయనం పోరాటం అనే నినాదంతో ఎస్‌ఎ్‌ఫఐ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వ విద్యారంగ సంస్థలను ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ అన్ని సంస్థల్లో మౌలిక వసుతుల కల్పన కోసం పోరాడుతుందన్నారు. వ్యవస్థ మార్పుతోనే విద్యారంగం మార్పు ముడిపడి ఉన్నందున చదువుతో పాటు విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం ముందు కు సాగాలన్నారు. ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ శాస్త్రీ య విద్య, అందరికీ ఉపాధి అవకాశాల కోసం విద్యార్థుల పక్షాన ఎస్‌ఎఫ్ అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. విద్యార్థి అమరులు, స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ డివిజన అధ్యక్షుడు మూడావత జగననాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర సైదానాయక్, నాయకులు వీరన్న, ప్రసన్న,రవి, మణి, కల్పన, రాధిక, అంజలి, స్వాతి, కావ్య, మాధవి, దేవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 11:12 PM