ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Uttam : బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేస్తే కఠిన చర్యలు

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:18 AM

పౌర సరఫరాల కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేస్తామని, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. పేదలకు అందించే రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేస్తే.. మిల్లర్లపై కఠిన చర్యలు

పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తాం

గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ: ఉత్తమ్‌

కాళేశ్వరం లోపాలపై నజర్‌

29న మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్‌, దుద్దిళ్ల

త ర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్దకు

ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షించే చాన్స్‌

లోక్‌సభ ఎన్నికల్లోనూ సీపీఐతో: దీపాదాస్‌

హుజూర్‌నగర్‌, డిసెంబరు 25 : పౌర సరఫరాల కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేస్తామని, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. పేదలకు అందించే రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేస్తే.. మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఓ రేషన్‌ దుకాణాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2014లో పౌర సరఫరాల కార్పొరేషన్‌ అప్పులు రూ.3,300 కోట్లు ఉండగా, ప్రస్తుతం అవి రూ.56వేల కోట్లకు చేరాయని చెప్పారు. ఏటా సర్కారు రూ.3 వేల కోట్లు వడ్డీ చెల్లిస్తోందని తెలిపారు. ప్రస్తుతం కార్పొరేషన్‌ రూ.11 వేల కోట్ల నష్టాల్లో ఉందని తెలిపారు. ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని రైతుల నుంచి ధాన్యం కొని మిల్లర్లకు ఇస్తుంటే.. వారు రెండు మూడేళ్ల తర్వాత అరకొరగా ప్రభుత్వానికి బియ్యం ఇస్తున్నారని ఆరోపించారు. కొంత మంది బియ్యాన్ని పాలిష్‌ చేసి ప్రభుత్వానికే మళ్లీ విక్రయిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి గ్యారెంటీ ఇవ్వకుండా మిల్లర్ల వద్ద రూ.22 వేల కోట్ల ధాన్యం ఉందని, దానిని రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కిలో రూ.39కి బియ్యం కొనుగోలు చేసి రేషన్‌ షాపుల ద్వారా అందిస్తుంటే 50 శాతం మంది ప్రజలు వాటిని తినడంలేదన్నారు. కొన్ని జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ నాయకుల అండ చూసుకుని మిల్లర్లు బియ్యం దందా చేశారని ఆరోపించారు. గత ఖరీఫ్‌ ధాన్యాన్ని వేరే రాష్ట్రాలకు విక్రయించిన ఉదంతాలపై విచారణ చేస్తామన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చించి నిల్వ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌ ద్వారా ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తామని చెప్పారు. కార్పొరేషన్‌లో చివరిసారిగా 2018-2019 సంవత్సరానికి సంబంధించి ఆడిట్‌ పూర్తయిందన్నారు. మళ్లీ ఆడిట్‌ వేగవంతం చేసి సేవలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను పునః సమీక్ష చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని గోదాముల్లో రేషన్‌ బియ్యం ముక్కవాసన వస్తున్నాయని చెప్పారు. గతంలోనే వాటిని కొనుగోలు చేస్తామని తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు అడిగినా కేసీఆర్‌ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఉత్తమ్‌ విమర్శించారు.

Updated Date - Dec 26 , 2023 | 01:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising