ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యశోదలో స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌

ABN, First Publish Date - 2023-12-10T04:03:34+05:30

యశోద ఆస్పత్రి తన హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ శాఖలో అత్యాధునిక బోన్‌ మారో, స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ (ఎముక మజ్జ మార్పిడి) సెంటర్‌ను శనివారం ప్రారంభించింది.

బ్లడ్‌ క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్స అందుబాటులోకి

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): యశోద ఆస్పత్రి తన హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ శాఖలో అత్యాధునిక బోన్‌ మారో, స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ (ఎముక మజ్జ మార్పిడి) సెంటర్‌ను శనివారం ప్రారంభించింది. కోల్‌కతా టాటా మెడికల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మమెన్‌ చాందీ, నవీ ముంబై అక్‌ట్రెక్‌ ఆస్పత్రి డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ ఖత్రీ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సెంటర్‌ను ప్రారంభించారు. చాందీ మాట్లాడుతూ మానవాళిని పట్టిపీడిస్తున్న వ్యాధుల్లో రక్త సంబంధ క్యాన్సర్లు ప్రధానమైనవన్నారు. దేశంలో ఏడాదికి 80 వేల కొత్త రక్త క్యాన్సర్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయన్నారు. క్యాన్సర్‌ చికిత్సలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా యశోద ఆస్పత్రిలో ప్రపంచస్థాయి బోన్‌ మారో, స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారంటూ యాజమాన్యాన్ని అభినందించారు. యశోద ఆస్పత్రుల డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరుకంటి మాట్లాడుతూ బ్లడ్‌ క్యాన్సర్లు పూర్తిగా నయమవుతాయని, రోగులు చికిత్స తర్వాత సాధారణ జీవితాన్ని గడపవచ్చన్నారు. లుకేమియా, లింఫోమా, మల్టిపుల్‌ మైలోమా వంటి వివిధ రకాల రక్త క్యాన్సర్లను మాత్రమేకాకుండా అప్లాస్టిక్‌ అనీమియా, ఇమ్యునో డెఫిషియెన్సీ డిజార్డర్స్‌, జెనెటిక్‌, మెటబాలిక్‌ డిజార్డర్స్‌, ఆటోఇమ్యూన్‌ డయోడర్స్‌ వంటి క్యాన్సర్‌ కాని రక్త రుగ్మతలకు కూడా ఒకే దగ్గర చికిత్స అందించగల ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలను యశోద ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చిందన్నారు. యశోద హైటెక్‌ సిటీ ఆస్పత్రి హెమటో ఆంకాలజిస్ట్‌, బీఎంటీ స్పెషలిస్ట్‌ డాకట్ర్‌ గణేశ్‌ జల్‌షెట్వార్‌ మాట్లాడుతూ రక్త క్యాన్సర్‌ స్త్రీ, పురుషులను, ఏ వయసులో వారినైనా ఒకేలా ప్రభావితం చేస్తుందన్నారు.

Updated Date - 2023-12-10T06:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising