ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పండి
ABN, First Publish Date - 2023-12-10T23:04:25+05:30
కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆరు గ్యారెంటీలను ఎలా అమలు పరుస్తుందో ఆ పార్టీ నాయకులు ప్రజలకు తెలియజేయాలని భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ఏపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఫ బీజేపీ నాయకుడు మిథున్‌రెడ్డి
మహబూబ్ నగర్ (కలెక్టరేట్), డిసెంబరు 10 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆరు గ్యారెంటీలను ఎలా అమలు పరుస్తుందో ఆ పార్టీ నాయకులు ప్రజలకు తెలియజేయాలని భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ఏపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మి కాంగ్రెస్ ను గెలిపించారని, అయితే, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, వివిధ పద్దులకు పోను ఆరు గ్యారెంటీలను ఎలా అమలు పరుస్తారన్నది ప్రజలకు తెలియజే యాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశాడు. గత ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశాడు. ఇక్కడున్న మాజీ మంత్రి చేసిన ఆక్రమణలు, ప్రభుత్వ, ప్రైవేట్ భూ కబ్జాలు, మాయమైన చెరువులు, కుంటలు, గుట్టలు, దేవాలయాల భూములను వెలికి తీయాలని డిమండ్ చేశారు. అనర్హులకు ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్‌ల పై విచారణ చేయించాలని ఆయన ఇక్కడున్న శాసనసభ్యులను డిమాండ్ చేశారు. పాలమూరు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు వారి వెటే ఉంటానని అన్నా రు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో తన స్వగృహంలో గ్రీవెన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ జిల్లా అద్యక్షులు వీరబ్రహ్మచా రి మాట్లాడుతూ అంగవైకళ్యం కలిగిన యువతికి ఉద్యోగం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఆమెకు కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పించడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, పడాకుల బాలరాజు, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్, ఉపాధ్యక్షుడు కృష్ణవర్ధన్ రెడ్డి, పి. సత్యం. బుచ్చిరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అచ్చుగట్ల అంజయ్య, మీడియా సెల్ కన్వీనర్ కోస్గి సతీష్ కుమార్, పట్టణ అధ్యక్షుడు నారాయణ యాదవ్, మండల అద్యక్షుడు రాజుగౌడ్ పాల్గొన్నారు.
Updated Date - 2023-12-10T23:04:27+05:30 IST