ఎక్సైజ్ కమిషనర్‌గా ఈ శ్రీధర్ బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - Dec 28 , 2023 | 03:45 AM
ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఈ శ్రీధర్ బుధవారం నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
టీఎ్‌సఐఐసీ ఎండీగా అదనపు బాధ్యతలు
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా చార్జి తీసుకున్న కమలాసన్‌రెడ్డి
ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఈ శ్రీధర్ బుధవారం నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న శ్రీధర్ ఇటీవల జరిగిన బదిలీల్లో ఎక్సైజ్ కమిషనర్‌గా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎ్‌సఐఐసీ) ఇన్‌చార్జి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు టీఎ్‌సఐఐసీ ఎండీగా ఉన్న ఈవీ నర్సింహారెడ్డి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా ఐపీఎస్ అధికారి వీబీ కమలాసన్ రెడ్డి కూడా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్‌గా నియమితులైన కమలాసన్ రెడ్డికి ప్రభుత్వం ఈ అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
Updated Date - Dec 28 , 2023 | 03:45 AM