జీపీ కార్మికుల సేవలు అమూల్యమైనవి : వీరేశం
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:10 AM
ప్రజారోగ్య రక్షణ లో గ్రామ పంచాయతీ కార్మికులు అందిస్తున్న సేవ లు అమూల్యమైనవని ఎమ్మెల్యే వే ముల వీరేశం అ న్నారు.
జీపీ కార్మికుల సేవలు అమూల్యమైనవి : వీరేశం
నార్కట్‌పల్లి, డిసెంబరు 25: ప్రజారోగ్య రక్షణ లో గ్రామ పంచాయతీ కార్మికులు అందిస్తున్న సేవ లు అమూల్యమైనవని ఎమ్మెల్యే వే ముల వీరేశం అ న్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నార్కట్‌పల్లిలోని మదర్ థెరిస్సా రూరల్ డెవల్‌పమెంట్ సొసైటీ (ఎంటీఆర్‌డీఎస్) ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులకు బహూకరించిన దుప్పట్లను ఆయన అందజేసి మాట్లాడారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య పనులు నిర్వహించే కార్మికులకన్నా ఎ వరూ గొప్ప కాదని, వారి సేవలను వీరేశం కొనియాడారు. జీపీ కార్మికులను మ ల్టీపర్పస్ కార్మికులుగా పరిగణిస్తూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ఎంస్ నెం.51ని రద్దు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతానని హామీ ఇచ్చారు. ఏడేళ్లుగా నార్కట్‌పల్లి గ్రామాభివృద్ధి, పేదలు, మహిళల సాధికారికతకు తమ వంతు సేవలందిస్తున్న ఎంటీఆర్‌డీఎస్ డైరెక్టర్ జూలియనను ఎమ్మెల్యే అభినందించారు. వ చ్చే జూన నుంచి ఉద్దీపనకు మళ్లీ శ్రీకారం చుడతానని ప్రకటించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ దూదిమెట్ల స్రవంతి, మాజీ సర్పంచులు దూదిమెట్ల సత్తయ్య, పుల్లెంల అచ్చాలు, సట్టు సత్తయ్య, మట్టిపల్లి శ్రీనివాస్, ఎంటీఆర్‌డీఎస్ డైరెక్టర్లు జూలియన, జోసెఫ్ మదాని, సిబ్బంది రాజు, జోసెఫ్, మనీత, కుశలవ, నందిని నాగమణి, కాంగ్రెస్ నాయకులు దోసపాటి ప్ర సాద్, చల్లా వాసుదేవ్, బిక్షమ య్య, భరత, సత్తి, సమద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 12:10 AM