రూ.20లక్షల విలువైన అల్ర్ఫాజోలం పట్టివేత
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:00 PM
షాద్‌నగర్‌లో దొంగచాటుగా అల్ర్ఫాజోలం విక్రయిస్తున్న ముఠా సభ్యులను టాన్యాబ్ పోలీసులు పట్టుకున్నారు.
నిందితుల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్
షాద్‌నగర్ రూరల్, డిసెంబరు 26: షాద్‌నగర్‌లో దొంగచాటుగా అల్ర్ఫాజోలం విక్రయిస్తున్న ముఠా సభ్యులను టాన్యాబ్ పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి మంగళవారం డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డిలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గొల్ల రమేష్ మెదక్‌కు చెందిన విఠల్‌గౌడ్‌తో చేతులు కలిపి అక్కడి నుంచి రెండు కిలోల అల్ర్ఫాజోలం తెచ్చి సోమవారం మధ్యాహ్నం షాద్‌నగర్‌లోని పరిగి రోడ్డులో విక్రయించేందుకు ప్రయత్నించాడన్నారు. అందిన సమాచారం మేరకు టీన్యాబ్ పోలీసులు దాడి చేసి అతడిని పట్టుకున్నట్టు చెప్పారు. అతడి నుంచి రూ.20లక్షల విలువైన 2కిలోల ఆల్ఫాజోలం, కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. షాబాద్ మండలం నాగర్‌గూడకు చెందిన నర్సింలుగౌడ్, వెంకటయ్యగౌడ్‌లకు కూడా ఈ కేసులో ప్రమేయం ఉందన్నారు. దీనిలో మొత్తం 8 మంది ప్రమేయముండగా రమేష్, నర్సింలుగౌడ్‌లను పట్టుకొని రిమాండ్‌కు తరలించామని, మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు రాంరెడ్డి వివరించారు.
Updated Date - Dec 26 , 2023 | 11:00 PM