ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మమ్మల్ని రిలీవ్‌ చేయండి

ABN, First Publish Date - 2023-12-11T03:37:54+05:30

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి పలు శాఖలకు చెందిన అధికారులు రాజీనామాలు చేస్తుండగా, మరికొందరు తమను రిలీవ్‌ చేయమంటూ ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నారు.

ఆర్‌ అండ్‌ బీ సెక్రటరీకి ఈఎన్సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డి లేఖలు

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి పలు శాఖలకు చెందిన అధికారులు రాజీనామాలు చేస్తుండగా, మరికొందరు తమను రిలీవ్‌ చేయమంటూ ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు చెందిన రహదారుల ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ రవీందర్‌రావు, భవనాలు, నేషనల్‌ హైవే్‌సకు చెందిన ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతి రెడ్డి తమను పదవుల నుంచి రిలీవ్‌ చేయాలని కోరుతూ ఆ శాఖ సెక్రటరీకి లేఖలు రాసినట్టు తెలిసింది. రెండ్రోజుల క్రితమే వారు రిలీవ్‌ చేయమని కోరుతూ లేఖలు ఇచ్చినట్టు సమాచారం. ఇదే సమయంలో శాఖకు కొత్త మంత్రి రావడంతో ఆ లేఖలపై ఉన్నతాధికారులు ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు. కాగా, గత ప్రభుత్వం నిర్మించిన నూతన సచివాలయం, అమరుల స్తూపం, అంబేడ్కర్‌ విగ్రహం నిర్మాణాల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. పైగా నూతన సచివాలయ నిర్మాణ వ్యయం ఎంత అనే దానిపై అధికారులు ఇప్పటికీ స్పష్టతను ఇవ్వలేదు. దీంతో వాటిపై స్పష్టత వచ్చాకే ఈఎన్సీలు రిలీవ్‌ అయ్యే అవకాశాలుంటాయని తెలుస్తోంది.

Updated Date - 2023-12-11T03:37:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising