ప్రజల కోసం పని చేస్తాం
ABN, First Publish Date - 2023-12-10T22:57:55+05:30
తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని, ప్రజా నిర్ణయాన్ని శిరసా వహిస్తామని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.
ఆదిభట్ల, డిసెంబరు 10: తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని, ప్రజా నిర్ణయాన్ని శిరసా వహిస్తామని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిభట్ల మునిసిపాలిటీ పరిధి బొంగులూర్‌లో గల కళ్లెం జంగారెడ్డి గార్డెన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తన విజయం కోసం రాత్రనక పగలనక కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే అధిష్ఠానం అన్నారు. ఓటమితో తాను నిరాశ చెందలేదని, బీఆర్‌ఎస్ అంటేనే ఉద్యమాల పార్టీ అని కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలుపుకోకుంటే మనం ప్రజల పక్షాన పోరాటం చేద్దామన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడంతో చాలామంది కలత చెందుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలే కాంగ్రెస్ నేతలకు తగిన బుద్ధిచెప్తారన్నారు. త్వరలో గ్రామాల వారీగా తమకొచ్చిన ఓట్ల సరళిని సమీక్షించుకుంటానన్నారు. ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామమన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు క్యామ మల్లేష్, యాచారం జెడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, బీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు కె.రమే్‌షగౌడ్, పి.బాషా, ఎం.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-10T22:57:57+05:30 IST