ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఖాళీ అవుతున్న బీఆర్‌ఎస్‌

ABN, First Publish Date - 2023-10-30T23:49:21+05:30

ఘట్‌కేసర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాళీ అవుతోంది. నాయకులు అనుచరులతో కలిసి కాంగ్రె్‌సలో చేరేందుకు సమయత్తం అవుతున్నారు.

కొడంగల్‌: రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

  • భారీగా కాంగ్రెస్‌లో చేరికలు

  • ఘట్‌కేసర్‌లో 2వేల మందిలో కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు

  • బీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యమంటూ నినాదం

ఘట్‌కేసర్‌. అక్టోబరు 30: ఘట్‌కేసర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాళీ అవుతోంది. నాయకులు అనుచరులతో కలిసి కాంగ్రె్‌సలో చేరేందుకు సమయత్తం అవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు కాంగ్రె్‌సలో చేరి ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో ఘట్‌కేసర్‌ మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆయన తనయుడు జడ్పీచైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు మండల, గ్రామ స్థాయి నాయకులు ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఇప్పటికే కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ పెరగడంతో పలువురి చూపు కాంగ్రె్‌సపై పడింది. ఇందులో భాగంగా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీకి చెందిన మెజార్టీ కౌన్సిలర్లు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో పార్టీ నాయకులు ఈ విషయాన్ని మంత్రికి చేరవేశారు. వెంటనే అమాత్యుడు రంగంలోకి దిగి అసమ్మతితో ఉన్న కౌన్సిలర్లును అన్నోజిగూడలోని ఓహోటల్‌లో సమావేశపరిచి పర్చి బుజ్జగించారు. ఇదీలా ఉండగా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ మాజీ సర్పంచ్‌ అబ్బసాని యాదగిరి తన అనుచరులతో కలిసి కాంగ్రె్‌సలో చేరేందుకు ముహుర్తం ఖారారు చేసుకున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయనతోపాటు పలువురు కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిఽఽధులు దాదాపు 2వేల మందితో పార్టీలో చేరేందుకు సమయత్తమవుతున్నారు. దీంతో పాటు చాలా మంది అంతర్గంతంగా మద్దతు తెలిపేందుకు రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుస్తోంది. ఘట్‌కేసర్‌లో బాలాజీనగర్‌లో గట్టిపట్టున్న నాయకుడు అబ్బసాని యాదగిరి చేరికతో కాంగ్రెస్‌ పార్టీకి మరింత బలం చేకూరనుంది.

కాంగ్రెస్‌లో చేరిన గిరిజన నాయకులు

బొంరాస్‌పేట్‌: మండలంలోని గట్టెగాని తండా గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్‌ఎస్‌ యువనాయకుడు, లంబాడ హక్కుల పోరాట సమితి వికారాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్‌నాయక్‌ ఆధ్వర్యంలో సోమవారం తండాకు చెందిన లోక్యానాయక్‌, పాండునాయక్‌, దేవ్లనాయక్‌, శంకర్‌నాయక్‌, రవినాయక్‌, నార్యానాయక్‌, గట్టెగాని తండా సర్పంచ్‌ లక్ష్మీబాయితో పాటు రాజునాయక్‌, రాములునాయక్‌ పాటు పలువురు కాంగ్రెస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదేవిధంగా బొంరా్‌సపేట్‌ మండలంలోని వడిచర్ల, తుంకిమెట్ల గ్రామాల్లో కాంగ్రెస్‌ నాయకులు పార్టీ ఆరు గ్యారంటీలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాతుల శ్రీను, గోపాల్‌రెడ్డి, నారాయణగౌడ్‌, నర్సింహులు, రాములు పాల్గొన్నారు.

సొంత గూటికి నేతలు

తాండూరు: తాండూరులో బీఆర్‌ఎ్‌సలో చేరిన కాంగ్రెస్‌ నేతలు సొంతగూటికి చేరారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే పనిచేసిన నారాయణరావు 2004లో, మున్సిపల్‌ చైర్మన్‌గా, బీసీసీబీ చైర్మన్‌గా పనిచేసిన లక్ష్మారెడ్డిలు 2019లో కాంగ్రె్‌సను వీడి బీఆర్‌ఎ్‌సలో చేరారు. తర్వాత బీజేపీలో చేరిగి సొంతగూడు కాంగ్రె్‌సకు వచ్చేశారు. వీరితో పాటు కాంగ్రెస్‌ పార్టీ నుంచి బల్దియా చైర్‌పర్సన్‌గా ఉన్న సునీత భర్త బీఆర్‌ఎ్‌సలో చేరగా తిరిగి కాంగ్రె్‌సకే వచ్చారు. వీరంతా కాంగ్రె్‌సలో ముఖ్య భూమిక పోషించారు. ప్రధానపదవులు అనుభవించారు. కాంగ్రెస్‌ గాలి వీస్తున్న సమయంలో వారంతా సొంతగూటికి వచ్చారు. కార్యకర్తల్లో పాత కాంగ్రెస్‌ కనిపిస్తున్నది వీరికి తోడు బిఆర్‌ఎస్‌ పార్టీల నేతలు కలవడంతో కొత్త, పాత కలయికగా మారింది.

రేవంత్‌రెడ్డి సమక్షంలో..

కొడంగల్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రె్‌సలో చేరారు. సోమవారం హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి నివాసంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కట్కం శివకుమార్‌గుప్త, కొడంగల్‌ మండలం చిట్లపల్లి సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు జీ.రాంరెడ్డి, చంద్రకల్‌ మాజీ సర్పంచ్‌ నరేందర్‌, అంగడిరైచూర్‌ గ్రామ వార్డు సభ్యులు వెంకట్రాములుగౌడ్‌, బుగ్గప్ప, బీఆర్‌ఎస్‌ నాయకులు మురారి కాంగ్రె్‌సలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి రేవంత్‌రెడ్డి కండువాలతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్పదేశ్‌ముఖ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్‌, శ్రీరాం రెడ్డి, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు పాల్గొన్నారు.

‘గ్రామీణ ప్రాంతాలు కాంగ్రెస్‌ వైపే’

మూడుచింతలపల్లి: గ్రామీణ ప్రాంతాలన్నీ కాంగ్రెస్‌ వైపే ఉన్నాయని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు నక్క ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు. మండలంలోని కేశవపూర్‌ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం సుమారు 30మంది కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్‌గౌడ్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. తెలంగాణ తెచ్చింది.. ఇచ్చింది.. కాంగ్రెస్సే అని చెప్పారు. రాహుల్‌ గాంధీ ప్రకటించిన మేనిఫెస్టోను ఆరు భరోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్‌ఎ్‌సను భూస్థాపితం చేస్తామని తెలిపారు. మేడ్చల్‌ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వజ్రే్‌షయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, మండల అధ్యక్షుడు నర్సింహులు, ఉపాధ్యక్షుడు శశిధర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ విద్యార్థి నేత

తాండూరు: తాండూరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నియోజకవర్గ ఇన్‌చార్జి జిలాని సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్‌రెడ్డి, నాయకుడు డాక్టర్‌ సంపత్‌ ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు ఎదుర్కొని ప్రత్యేక తెలంగాణ సాధించుకోగా తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు పనిచేస్తామని తెలిపారు.

కాంగ్రెస్‌లోకి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

పరిగి రూరల్‌: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.చంద్రయ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ నేతృత్వంలో సోమవారం తన అనుచరులతో కలసి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుభా్‌షయాదవ్‌, నాయకులు వెంకట్‌రెడ్డి, కుడుముల యాదయ్య, శ్రీనివాస్‌, బానుచందర్‌, గొల్ల మల్లేష్‌, మాజీ ఎంపీటీసీ బాల్‌రాజ్‌, నర్సిరెడ్డి, నాగయ్య, చిన్నయ్య, అజ్మత్‌, జమీల్‌, అసద్‌, పెద్ద ఎత్తున చేరారు.

Updated Date - 2023-10-30T23:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising