ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అందని కిట్‌.. పోషకాలు ఫట్‌!

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:15 PM

మాతాశిశు సంరక్షణ కోసం గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ గర్భిణులకు అందని ద్రాక్షలా మారింది.

షాద్‌నగర్‌లో న్యూట్రిషన్‌ కిట్ల తేదీని చెక్‌ చేస్తున్న ఆరోగ్య సిబ్బంది(ఫైల్‌)

గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్ల కరువు

కాబోయే అమ్మకు కరువైన భరోసా

జిల్లాలో న్యూట్రిషన్‌ కిట్ల కొరత

రెండు కిట్లకు గాను ఒకదానితోనే సరిపెడుతున్న వైద్యులు

గర్భిణుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుకుండా ఉండేందుకు, వారిలో రక్తహీనత నివారణకు, శిశువు ఆరోగ్యవంతంగా జన్మించేందుకు ప్రభుత్వం న్యూట్రిషన్‌ కిట్లు పంపిణీ చేస్తోంది. గర్భం దాల్చిన ఐదో నెల, 9వ నెలల్లో ఒక్కోటి చొప్పున రెండు కిట్ల అందజేయాలి. అయితే జిల్లాలో ఈ పథకంగా ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదు. ప్రతీ ఆరోగ్య కేంద్రంలో వందల్లో గర్భిణులు చెకప్‌ చేయించుకుంటే పదుల సంఖ్యలో కూడా కిట్లు పంపిణీ కాలేదు. ఆరోగ్య శాఖ కిట్లు సరఫరా చేయకే ఈ సమస్య నెలకొంది. జిల్లాలో 19,896 మంది గర్భిణులు ఉండగా ఇప్పటి వరకు 6,780 మందికే కిట్లు అందజేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 17): మాతాశిశు సంరక్షణ కోసం గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ గర్భిణులకు అందని ద్రాక్షలా మారింది. రాష్ట్రంలో గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌కు అనుబంధంగా న్యూట్రిషన్‌ కిట్‌ను అందజేయాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని రాష్ట్రంలో మొదటి విడత ఎనిమిది జిల్లాల్లో అమలు చేసింది. ఈ పథకం ఆయా జిల్లాలో విజయవంతం కావడంతో మిగతా జిల్లాల్లోనూ అమలు చేశారు. పుట్టే శిశువు ఆరోగ్యవంతంగా ఉంచాలని, అలాగే తల్లి ఆరోగ్యం బాగుంటేనే శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టడంతో పాటు గర్భిణుల, బాలింతల ఆరోగ్యం బాగుంటుందనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన న్యూట్రిషన్‌ కిట్‌ కార్యక్రమం జిల్లాలో సరిగ్గా అమలు కావడం లేదు. న్యూట్రిషన్‌ కిట్ల సపరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో గర్భిణులకు సకాలంలో అందటం లేదు. (ఐదో నెల, 9వ నెలలో) రెండు సార్లు అందజేయాల్సిన ఈ కిట్‌ను అనేక ప్రాంతాల్లో ఒకే సారి ఇచ్చారు. జిల్లాలో గర్భిణులు, బాలింతలు 19,896 మంది ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 6,780 మంది గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్లు అందించినట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్న పరిధిలో రెండు న్యూట్రిషన్‌ కిట్లు ఇవ్వాల్సిన చోట ఒకటితోనే సరిపెట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అనుబంధ కేంద్రాల్లో కాకుండా గైనకాలజిస్టు ఉన్న చోట 3, 4వ చెక్‌పకు వచ్చిన వారికి వీటిని అందజేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం పరిధిలో ఇప్పటి వరకు 490నూట్రిషన్‌ కిట్లు పంపిణీ చేశారు. అక్కడ కేవలం మరో నాలుగు కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యాచారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 69 మంది గర్భిణులకు కిట్లు ఇచ్చారు. నెల రోజులుగా అక్కడ న్యూట్రిషన్‌ కిట్ల కొరత ఏర్పడింది. షాద్‌నగర్‌ పరిధిలో న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ సక్రమంగానే జరుగుతోంది. ప్రతి సోమ, బుధవారాల్లో మూడు నాలుగు విడత వైద్య పరిశీలన కోసం వచ్చే గర్భిణులకు వాటిని ఇస్తున్నారు. ఆమనగల్లులో న్యూట్రిషన్‌ కిట్ల కొత కారణంగా అక్కడ వాటిని గర్భిణులకు పంపిణీ చేయడం లేదు. నాలుగు నెలల క్రితం 75కిట్లు ఆసుపత్రికి వచ్చినప్పటికీ.. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు వాటిని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చేవెళ్ల ఏరియా ఆసుపత్రిలో ఇప్పటి వరకు 655 న్యూట్రిషన్‌ కిట్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం న్యూటిషన్‌ కిట్లు అందుబాటులేవని వైద్యులు తెలిపారు. జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో శ్రీకారం చుట్టిన ఈ పథకం కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తుందా? లేదా అనే సందేహం నెలకొంది. పథకం పేరు మార్చి గర్భిణులకు పౌష్టికాహార కిట్లు అందజేస్తుందనే ప్రచారం జరుగుతోంది.

న్యూట్రిషన్‌ కిట్‌లో ఉండేవి ఇవే..

ఒక్కో కిట్‌లో కిలో ప్రొటీన్‌ పౌడర్‌ ప్యాకెట్‌, 3 బాటిళ్ల ఐరన్‌ సిర్‌పలు, ఖర్జూరం ప్యాకెట్‌, నెయ్యి ప్యాకెట్‌, ఒక అల్బెండజోల్‌ మాత్రల సాచెట్‌, ఒక కప్పు ఉంటాయి.

న్యూట్రిషన్‌ కిట్‌ ఇవ్వలేదు : కె.వనిత, గర్భిణి, చేవెళ్ల

నేను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వైద్య పరీక్షలు చేశారు. కానీ.. ప్రభుత్వం ఇచ్చే న్యూట్రిషన్‌ కిట్‌ మాత్రం ఇవ్వలేదు. నేను గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతి నెలా చెక్‌ప కోసం ప్రభుత్వ ఆస్పత్రికే వెళ్తున్నా. గర్భిణులకు ఇస్తున్న న్యూట్రిషన్‌ కిట్‌ ఇవ్వమని అడిగితే ఆస్పత్రిలో లేదని వైద్యులు చెప్పారు. గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

గత నెల నుంచి స్టాక్‌ లేవు : డాక్టర్‌ సోమశేఖర్‌, ప్రభుత్వ ఆస్పత్రి, చేవెళ్ల

ఆసుపత్రిలో స్టాక్‌ ఉన్న వరకు గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్లు పంపిణీ చేశాం. గత నెల నుంచి కిట్ల సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రికి న్యూట్రిషన్‌ కిట్లు రాగానే మా ఆస్పత్రిలో చెకప్‌ చేయించుకుంటున్న గర్భిణులందరికీ నిబంధనల మేరకు కిట్లు అందజేస్తాం.

Updated Date - Dec 17 , 2023 | 11:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising