ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చికిత్స పొందుతూ ఇద్దరు మృతి

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:58 PM

శామీర్‌పేట పోలీస్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందాడు.

మూడుచితలపల్లి, డిసెంబరు 26: శామీర్‌పేట పోలీస్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహార్‌నగర్‌కు చెందిన కృష్ణ చారి శనివారం ఉదయం తన స్వగ్రామమైన శామీర్‌పేట మండలం లాల్‌గడి మలక్‌పేటకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. అలియాబాద్‌ బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో కృష్టచారికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్సనిమిత్తం కృష్ణచారిని నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మూడుచింతలపల్లి: శామీర్‌పేట పోలీస్టేషన్‌ పరిధిలోని కట్టమైసమ్మ వద్ద ఓగుర్తుతెలియని యువకుడిని గుర్తుతెలియని వాహనం ఆదివారం రాత్రి ఢీ కొంది. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం గాయపడ్డ యువకుడిని నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న యువకుడు మంగళవారం మృతిచెందాడు. మృతుడు బ్లూ ప్యాంటు, బ్లూ షర్టు ధరించి ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. మృత దేహాన్ని గాంధీ మర్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 26 , 2023 | 11:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising