ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజాపాలనలో వివక్షకు చోటు లేదు

ABN, Publish Date - Dec 30 , 2023 | 11:54 PM

సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజాపాలనలో ఎటువంటి వివక్ష ఉండదని, అర్హులందరికీ పథకాలు అందుతాయని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు.

కొత్తూర్‌ : ఇన్ముల్‌నర్వలో దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, ప్రతాప్‌రెడ్డి

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

‘అభయహస్తం’ దరఖాస్తుల స్వీకరణ

కొత్తూర్‌/నందిగామ, డిసెంబరు 30: సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజాపాలనలో ఎటువంటి వివక్ష ఉండదని, అర్హులందరికీ పథకాలు అందుతాయని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ శివారులో గల రైతువేదిక ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల పట్ల వివక్ష చూపుతూ.. వారి అనుచరులకే పథకాలు అందజేసిందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి, నియోజకవర్గ ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, తహసీల్దార్‌ జానకి, ఎంపీడీవో శరత్‌చంద్రబాబు, ఎంపీవో విజయలక్ష్మి, సర్పంచ్‌ అజయ్‌మిట్టునాయక్‌, ఉపసర్పంచ్‌ శ్రీరాములుయాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ రవికుమార్‌గుప్త, నాయకులు హరినాథ్‌రెడ్డి, జె. గోవర్ధన్‌గౌడ్‌, మిట్టునాయక్‌, ఖాజా, కాలేద్‌, శంకర్‌నాయక్‌, రవి ఆయా శాఖాల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ మాట ఇస్తే తప్పదని వీర్లపల్లి శంకర్‌ అన్నారు. నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో దరఖాస్తులు స్వీకరించారు. ఈమేరకు శంకర్‌ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రేవంత్‌రెడ్డి తొలిరోజునే ఆరు గ్యారంటీల పథకాల అమలుకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌తో పాటు గ్రామస్థులు గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. అంతకుముందు కార్యకర్తలు, గ్రామస్థులు వీర్లపల్లికి ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీడీవో బాల్‌రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్‌, సర్పంచ్‌ జేకే నర్సింలు, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌, ఎంపీటీసీ లతాశ్రీశైలం నాయకులు తదితరులున్నారు.

ఐదు గ్యారంటీలకు ఒకే దరఖాస్తు

కేశంపేట : ప్రజా పాలనలో భాగంగా ఐదు గ్యారంటీలకు సంబంధించి ఒకే దరఖాస్తు ద్వారా అప్లై చేసుకోవచ్చని ఎంపీడీవో రవిచంద్రకుమార్‌రెడ్డి సూచించారు. తూర్పు చౌలపల్లి, సంతాపూర్‌లలో ఎంపీడీవో, పాపిరెడ్డిగూడ, దత్తయపల్లిలో ఎంపీవో నర్సింలు తొమ్మిదిరేకుల, లింగంధనలో తహసీల్దార్‌ అజాంఅలీ, అల్వాల, పాటిగడ్డలలో ఏవో శిరీషలు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్పంచ్‌లు వీరేశ్‌, అంజయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీలత, సావిత్రి బాల్‌రాజ్‌గౌడ్‌, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి

కందుకూరు : అభయహస్తం పథకాల వర్తింపునకు ప్రతీ ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో వెంకట్రాములు కోరారు. మండలంలోని కొత్తగూడ సర్పంచ్‌ సాధ మల్లారెడ్డితో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడారు. మూడు రోజులకు 35 గ్రామ పంచాయతీలకు చెందిన 10,223 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఆకులమైలారం, గుమ్మడవెళ్లి, జైత్వారం సరాస్వతిగూడ, అగర్‌మియాగూడలో గ్రామసభలు నిర్వహించారు. తహసీల్ధార్‌ కె.గోపాల్‌, ఏపీవో రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌ లు జి.కళమ్మరాజు, ప్రభాకర్‌, సధాలక్ష్మీపుల్లారెడ్డి, రా ము, ఇ.భూపాల్‌రెడ్డి నాయకులు భూపాల్‌రెడ్డి, మాధ వాచారి, బాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, తదితరులున్నారు.

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

శంషాబాద్‌ రూరల్‌ : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ నాగమణి అన్నారు. బహదూర్‌గూడ, రషీద్‌గూడ, చిన్నగోల్కొండలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో నాగమణి పాల్గొన్నారు. సర్పంచ్‌లు, అధికారులతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. శంషాబాద్‌ మండలంలో ఇప్పటి వరకు 8,312 దరఖాస్తులు, 425 స్పెషల్‌ దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు.

ప్రతీ ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి

మంచాల : ప్రతీ ఒక్కరు అభయహస్తం పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ ప్రసాద్‌రావులు సూచించారు. లోయపల్లిలో దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు. సర్పంచ్‌ అనిత, వైస్‌ఎంపీపీ రాజేశ్వరి, మిద్దె శ్రీనివా్‌సగౌడ్‌, దాసు, మోతీరాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

‘ప్రజాపాలన’ను వినియోగించుకోవాలి

యాచారం : ప్రతీఒక్కరు ప్రజాపాలన కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఎంపీడీవో విజయలక్ష్మి చెప్పారు. అయ్యవారిగూడ, నందివనపర్తిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో పాల్గొని మాట్లాడారు. మంతన్‌గౌరెల్లి, కేస్లీతండాలలో ఎంపీవో ఉమారాణి పాల్గొన్నారు. కార్యక్రమాల్లో వ్యవసాయాధికారి సందీ్‌పకుమార్‌, డీటీ సాగర్‌, సర్పంచులు ఉదయశ్రీ, గంగా, మారు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి

చేవెళ్ల/శంకర్‌పల్లి, డిసెంబరు 30 : అర్హులైన వారందరూ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, చేవెళ్ల ఎంపీడీవో హిమబిందు, తహసీల్దార్‌ కృష్ణయ్య తెలిపారు. చేవెళ్ల మండలం గొల్లపల్లి, గొల్లగూడ, న్యాలట, సింగప్పగూడ, మల్కాపూర్‌, కుమ్మెర, దేవరంపల్లి, రేగడిఘణాపూర్‌ తదితర గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డులను చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి సందర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులున్నారు.

జోరుగా దరఖాస్తుల స్వీకరణ

ఆమనగల్లు/కడ్తాల/తలకొండపల్లి/మాడ్గుల : ప్రజాపాలన అభయ హస్తం గ్యారంటీ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఆమనగల్లు మండలంలో జోరుగా కొనసాగుతుంది. ఆకుతోటపల్లి, సీతారామ్‌నగర్‌ తండాలో సర్పంచ్‌లు రజిత శ్రీనివా్‌సరెడ్డి, లక్ష్మణ్‌నాయక్‌ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ఎంపీడీవో పారుఖ్‌హుస్సెన్‌, నిట్ట నారాయణ, ఉపసర్పంచ్‌ శేఖర్‌గౌడ్‌, నాయకులున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ 8వ వార్డు బీసీ కాలనీలో కౌన్సిలర్‌ రాధమ్మవెంకటయ్య అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌, అధికారులు పాల్గొన్నారు. కడ్తాల మండలం మైసిగండి, పెద్ద వేములోని బావితండా, గడ్డ మీది తండా, గోవిందాయిపల్లి తండాలలో సర్పంచ్‌లు తులసీరామ్‌నాయక్‌, పాండునాయక్‌, శ్వేత, రాము నాయక్‌ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. మైసిగండిలో ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, వార్డు సభ్యుడు రాందాస్‌ నాయక్‌, జవహర్‌లాల్‌ నాయక్‌, తులసీరామ్‌ నాయక్‌లు అధికారులు పాల్గొన్నారు. తలకొండపల్లి మండలం చౌదర్‌పల్లి, మాదాయిపల్లి, వెంకటాపూర్‌, అంతారం, దేవునిపడకల్‌, పెద్దూర్‌ తండాలో దరఖాస్తులు స్వీకరించారు. ఎంపీడీవో శ్రీకాంత్‌, సర్పంచ్‌లు చంద్రయ్య, వెంకటయ్య, రమేశ్‌యాదవ్‌, శ్రీశైలం, చక్రి పాల్గొన్నారు. అదేవిధంగా మాడ్గుల మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ఎంపీడీవో రాఘవులు, తహసీల్దార్‌ నిరంజన్‌రావులు పాల్గొన్నారు. ఇర్విన్‌, కాషగూడం, అవురుపల్లి, నల్లవారిపల్లి, దొడ్లపహాడ్‌, పకీర్‌తండాల్లో మొత్తం దరఖాస్తులు 1722 వచ్చాయని ఎంపీడీవో తెలిపారు. సర్పంచ్‌లు పుష్పలత, అలివేలు,పార్వతమ్మ, విజయ, పద్మ అధికారులు పాల్గొన్నారు.

ప్రజా పాలనలో అందరికీ న్యాయం

షాద్‌నగర్‌ రూరల్‌ : ప్రజా పాలనలో ప్రతీ ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఎంపీపీ ఖాజా ఇద్రిస్‌, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి తెలపారు. ఫరూఖ్‌నగర్‌ మండలం చించోడులో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. విఠ్యాల గ్రామసభలో ఎంపీడీవో వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు. సర్పంచ్‌లు బాలమణి దామోదర్‌, జయశ్రీచంద్రశేఖర్‌, రాములుగౌడ్‌ తదితరులున్నారు.

అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి

కొందుర్గు : ప్రజా పాలనలో భాగంగా పథకాల వర్తింపు కోసం అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో ఆంజనేయులు సూచించారు. శ్రీరంగాపూర్‌, మహాదేవ్‌పూర్‌, చెర్కుపల్లి, విశ్వనాథ్‌పూర్‌ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. తహసీల్దార్‌ రమే్‌షకుమార్‌, సర్పంచులు అరుంధతీ రమే్‌షరెడ్డి, రాంచంద్రయ్య, కృష్ణవేణి, శ్రీధర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 11:54 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising