వైండింగ్ షాపులో చోరీ
ABN, Publish Date - Dec 28 , 2023 | 12:19 AM
మండలంలోని మహలింగాపురం గ్రామంలోని ఓ వైండింగ్ షాపులో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహలింగాపురం గ్రామానికి చెందిన మహమూద్ మోటర్ వైండింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు.
శంకర్‌పల్లి, డిసెంబరు 27 : మండలంలోని మహలింగాపురం గ్రామంలోని ఓ వైండింగ్ షాపులో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహలింగాపురం గ్రామానికి చెందిన మహమూద్ మోటర్ వైండింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. మంగళవారం ఎప్పటి లాగే పని ముగించుకుని షాపుకు తాళంవేసి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం షాపును తెరువగా.. సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్‌ఐ సత్యనారాయణ షాపును పరిశీలించారు. షాపుకు వెనక నుంచి రంధ్రం చేసి బోరుమోటర్లు, వైర్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దాదాపు రూ.లక్ష విలువ గల సామగ్రి ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు.
Updated Date - Dec 28 , 2023 | 12:19 AM