ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వ్యక్తి దారుణ హత్య

ABN, Publish Date - Dec 31 , 2023 | 11:41 PM

ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారులోని మామిడిపల్లికి చెందిన పితంబర్‌ మల్లేష్‌(28) మండల పరిధిలోని ఘాన్సిమియాగూడలో ఉన్న ఓ టెంట్‌హౌజ్‌లో కూలీగా పని చేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్నాడు.

సంఘటన స్ధలాన్ని పరిశీలించిన డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీం

శంషాబాద్‌ రూరల్‌, డిసెంబరు 31 : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారులోని మామిడిపల్లికి చెందిన పితంబర్‌ మల్లేష్‌(28) మండల పరిధిలోని ఘాన్సిమియాగూడలో ఉన్న ఓ టెంట్‌హౌజ్‌లో కూలీగా పని చేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే, నాలుగు రోజులక్రితం టెంట్‌హౌజ్‌ యజమానికి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారి ఘన్సిమియాగూడ వద్ద గుర్తుతెలియని శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ శ్రీధర్‌కుమార్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని కత్తులతో పొడిచి చంపినట్లు నిర్ధారణకు వచ్చారు. ఘటన స్థలానికి డాగ్‌స్వ్కాడ్‌, క్లూస్‌ టీంలను రప్పించి వివరాలు సేకరించారు. పోలీస్‌ జాగిలం సాయిబాబా టెంపుల్‌ నుంచి కొంత దూరం వెళ్లి ఓ షెడ్డు వద్ద నిలిచిపోయింది. అయితే, ఆ షెడ్డులో ఎవరూ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్న రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, మల్లే్‌షకు వివాహం అవ్వగా భార్య విడిచిపెట్టిందని, తరువాత మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ద ర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

Updated Date - Dec 31 , 2023 | 11:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising