ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన కారు
ABN, First Publish Date - 2023-11-10T23:55:19+05:30
ఆగి ఉన్న డీసీఎంను అతివేగంతో కారు వెనక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇద్దరి దుర్మరణం.. మరో ఇద్దరికి గాయాలు
ఆదిభట్ల, నవంబరు 10: ఆగి ఉన్న డీసీఎంను అతివేగంతో కారు వెనక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్ పరిధిలో ర్యావిరాల ఔటర్ జంక్షన్ ఎగ్జిట్ 13 సమీపంలో శుక్రవారం రాత్రి 7.30ప్రాంతంలో జరిగింది. ఆదిభట్ల ఎస్సై శ్రీనివా్‌సరావు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెంకు ఉదయనగర్ కాలనీకి చెందిన గుగ్లోత్ రాంబాబు అతడి సోదరుడు రాజే్‌షతో కలిసి మార్బుల్స్ ఖరీదు చేసి అశోక్ లేలాండ్ మినీ డీసీఎం వాహనంలో హైదరాబాదు నుంచి భద్రాద్రి కొత్తగూడెం వెళ్తున్నారు. మహేశ్వరం మండలం ర్యావిరాల ఔటర్ సమీపంలోకి రాగానే డీసీఎం టైర్ పంక్చరైంది. డీసీఎంను ఔటర్ రెండో లేన్‌పైనే నిలిపి జాకీ పెట్టి టైరు మార్చుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి లేడీ ప్యాసింజర్‌ను తీసుకుని కీసర దమ్మాయిగూడకు వెళ్తున్న ట్యాక్సీ కారు ఔటర్‌పై ఆగి ఉన్న ఈ డీసీఎంను వెనక నుంచి బలంగా ఢీకొంది. దీంతో డీసీఎం టైరు మారుస్తున్న గుగ్లోత్ రాంబాబు(30), అతడికి సహాయం చేసిన మరో వ్యక్తి నల్గొండ జిల్లా లెంకలపల్లికి చెందిన చాపల హరిబాబు(33) ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. డీసీఎం డ్రైవర్ బుక్యా శ్రీనివాస్, కారులో ఉన్న మహిళకు స్వల్పం గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించి మృతదేహాలను ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు అతి వేగంగా నిర్లక్ష్య డ్రైవింగే ప్రమాదానికి కారణం అని, కారు డ్రైవర్ బాల్‌రాజును అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - 2023-11-10T23:55:20+05:30 IST