కుక్కను తప్పించబోయి కారుబోల్తా
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:47 PM
కుక్కను తప్పించబోయి కారుబోల్తాపడ్డ ఘటనలోఏడుగురు యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దేముల్ మండలం ఖానాపూర్ గేటు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది.
ఏడుగురికి గాయాలు ఫ ఒకరి పరిస్థితి విషమం
పెద్దేముల్, డిసెంబరు 18: కుక్కను తప్పించబోయి కారుబోల్తాపడ్డ ఘటనలోఏడుగురు యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దేముల్ మండలం ఖానాపూర్ గేటు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ గండిపేట్‌కు చెందిన నసీర్, వసీమ్, సోహెబ్, మక్సూద్, హఫీజ్, నదీన్, మన్సూర్‌లు తాండూరులో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో వస్తున్నారు. వీరు పెద్దేముల్ మండలం ఖానాపూర్ గేటు సమీపంలోని వాడుక వద్దకు రాగానే వీరి కారుకు కుక్క అడ్డువచ్చింది. దానిని తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పెద్దేముల్ పోలీసులు వీరిని చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అందులో సోహెబ్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పెద్దేముల్ ఎస్‌ఐ కాశీనాథ్ వెల్లడించారు.
Updated Date - Dec 18 , 2023 | 11:47 PM