ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బోరు మోటార్ల కేబుల్‌ వైర్లు చోరీ

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:24 PM

రై తుల వ్యవసాయ బోరు మోటార్లకు సం బంధించిన కేబుల్‌ వైర్లను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మండల పరిధిలోని తోలుకట్టలో చోటుచేసుకుంది.

మొయినాబాద్‌, డిసెంబరు, 17: రై తుల వ్యవసాయ బోరు మోటార్లకు సం బంధించిన కేబుల్‌ వైర్లను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మండల పరిధిలోని తోలుకట్టలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోలుకట్ట గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ పొలాల వద్ద బోరు మోటార్లకు కరెంటు సరఫరా చేసేందుకు కనెక్టింగ్‌ కేబుల్‌ వైర్లను ఏర్పాటు చేశారు. కాగా, శనివారం గుర్తుతెలియని దుండగులు వైర్లను ఎత్తుకెళ్లినట్లు గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి, భుజంగ్‌రెడ్డి, రాములు తదితర రైతులు తెలిపారు. గ్రామానికి చెందిన 20మంది కేబుల్‌ వైర్లు అపహరణకు గురైనట్లు చెప్పారు. వెంకట్‌రెడ్డి అనే రైతు పొలం వద్ద బోరులోంచి మోటర్‌ను బయటకు తీసి వైరు కోసుకెళ్లారు. ఆదివారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతుల వైర్లు కట్‌ చేసి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేబుల్‌ వైర్లు కాల్చి అందులోని రాగిని తీసి అమ్ముకునేందుకు దొంగలు వైర్లు కట్‌చేసి తీసుకెళ్లి ఉంటారని రైతులు చెబుతున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:24 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising