ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి

ABN, Publish Date - Dec 30 , 2023 | 12:05 AM

ఎవరు ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా.. కేసీఆర్‌ ఇచ్చిన గ్యారంటీలే గొప్పవని, కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల ముందు చెప్పిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.

కందుకూరు : రవికుమార్‌తో కలిసి అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సబితాఇంద్రారెడ్డి

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి

కందుకూరు, డిసెంబరు 29 : ఎవరు ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా.. కేసీఆర్‌ ఇచ్చిన గ్యారంటీలే గొప్పవని, కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల ముందు చెప్పిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామ నర్సింహారెడ్డి ఫంక్షన్‌హాలో బీఆర్‌ఎస్‌ మండల శాఖ అఽధ్యక్షుడు జయేందర్‌ అధ్యక్షతన నిర్వహించిన కృతజ్ఞత సభలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలు అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి అఽధికారంలోకి వచ్చారని, అర్హులందరికీ పథకాలు అందేవరకూ బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ నాయకులు ప్రజలకు ఇచ్చిన 400 హామీలు తూచా తప్పకుండా నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన కొన్ని రోజులకే ఫార్మసిటీని ఎత్తివేయడం, కందుకూరు వరకు మెట్రోరైల్‌ నిర్మాణ పనులను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించడం బాధగా ఉందన్నారు. కాగా, మండలంలోని కొత్తూరు గేటు వద్ద ఏర్పాటు చేసిన బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ‘డిక్కి’ జాతీయ అధ్యక్షుడు నర్ర రవికుమార్‌తో కలిసి సబితారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. జడ్పీటీసీ జంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి నాయకులు బేర బాలకిషన్‌, చిర్ర సాయిలు, జి.లక్ష్మీనర్సింహరెడ్డి, జె.గణే్‌షరెడ్డి, ఏజీ అంజయ్యగౌడ్‌, ఎస్‌.లచ్చానాయక్‌, ఎలుక మేఘనాథ్‌రెడ్డి, కె.సదానంద్‌గౌడ్‌, అమరేందర్‌రెడ్డి, తదితరులున్నారు.

వైభవంగా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

మహేశ్వరం : మండల కేంద్రంలో కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మావురాల ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మహా కుంభాభిశేకం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు కె.చంద్రయ్య, సురేందర్‌రెడ్డి, నందం, రాజునాయక్‌, జయేందర్‌, యాదయ్య, అంజయ్య, ఆనందం, నవీన్‌, ప్రియాంక రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:05 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising