ఆర్టీసీ పరిగి డిపోలో సంబురాలు
ABN, First Publish Date - 2023-12-05T23:36:23+05:30
కాంగ్రెస్ విజయం, ఆర్టీసీ ఉద్యోగుల విజయమని ఆర్టీసి ఉద్యోగుల జేఏసి రాష్ట్ర కార్యదర్శి కె.హన్మంత్‌ముదిరాజ్ పేర్కొన్నారు. బుఽధవారం పరిగి డిపో ఎదుట ఆర్టీసి ఉద్యోగులు విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు.
పరిగి, డిసెంబరు 5: కాంగ్రెస్ విజయం, ఆర్టీసీ ఉద్యోగుల విజయమని ఆర్టీసి ఉద్యోగుల జేఏసి రాష్ట్ర కార్యదర్శి కె.హన్మంత్‌ముదిరాజ్ పేర్కొన్నారు. బుఽధవారం పరిగి డిపో ఎదుట ఆర్టీసి ఉద్యోగులు విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పదేళ్ళుగా రెండు పీఆర్‌సీలు, డిఏలు కావాల్సి ఉందని, కొత్త ప్రభుత్వంలో సిద్దిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసికి మంచి రోజులు రానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసి ఉద్యోగ సంఘాల నాయకులు వెంకట్‌రాంలు, జీవీకేరెడ్డి, శంషుద్దీన్, రవి,శ్రీశైలం, కృష్ణ; రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-05T23:36:24+05:30 IST