ఉత్సాహంగా 5కే, 10కే రన్
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:15 AM
రన్ అన్‌విండ్ ఎంజాయ్ థీమ్‌తో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్ మూడవ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది.
ఎయిర్‌పోర్ట్ రన్ 3వ ఎడిషన్‌లో పాల్గొన్న 3,800 మంది రన్నర్స్
ప్రారంభించిన ఎస్‌జీకే కిషోర్, సీఈవో ప్రదీప్ ఫణికర్
శంషాబాద్, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): రన్ అన్‌విండ్ ఎంజాయ్ థీమ్‌తో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్ మూడవ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా 5కే, 10కే రన్‌లలో సుమారు 4వేల మంది ఉత్సాహవంతులైన రన్నర్లు పాల్గొన్నారు. ఈ యేడాది 18 నుంచి 39 యేళ్ల వరకు (పురుషులు, స్త్రీలు), 40 నుంచి 59 (పురుషులు, స్ర్తీలు), 60 యేళ్లు పైబడిన వారిని ఆరు కేటగిరీలుగా విభజించి రన్ నిర్వహించారు. విజేతలను ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ పథకాలు బహుమతులతో సత్కరించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ విమానాశ్రయం మరియు నగరం యొక్క కమ్యూనిటీలను కలుపుతూ ఫిట్‌నెస్ యొక్క ప్రాధాన్యత తెలుపడానికి విమానాశ్రయం యొక్క పచ్చని పరిసరాల్లో జరిగిన మూడవ ఎడిషన్ రన్ ఒక గొప్ప కార్యక్రమమని అన్నారు. గతయేడాది ఈ రన్‌లో పాల్గొన్న దాదాపు 3000 వేల మంది నుంచి ప్రోత్సాహకరమైన స్పందన లభించిందన్నారు. ఈ యేడాది 3800 మంది రన్ మరియు స్పోర్ట్స్ ఔత్సాహికులు ఫిట్‌నెస్ మక్కువతో ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. వినోదం, ఆహ్లాదకరమైన ఆహారం మరియు కార్నివాల్ యొక్క స్ఫూర్తిని ఉన్నతంగా ఉంచే సంగీతంతో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రఖ్యాత గాయకుడు, ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామచంద్ర పాడిన గేయాలు అందరినీ ఉర్రూతలూగించాయి. ఫ్యూజన్ డ్యాన్స్, ఫ్లాష్‌మాబ్స్, నెయిల్ ఆర్ట్స్, ఫ్లీమార్కెట్, పిల్లల కోసం ప్లేజోన్ ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు కమ్యూనిటీ కుటుంబాలకు వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
Updated Date - Dec 17 , 2023 | 12:15 AM