ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అసెంబ్లీ ఎన్నికల్లో రోహిత్‌రెడ్డి గెలుపు ఖాయం

ABN, First Publish Date - 2023-11-10T23:40:13+05:30

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి గెలుపొందడం ఖాయమని ఆల్‌ ఇండియా బంజరా సంఘం నాయకులు శంకర్‌నాయక్‌ పవార్‌ అన్నారు.

తాండూరు రూరల్‌: ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని సన్మానిస్తున్న శంకర్‌నాయక్‌, వాసేపవార్‌

తాండూరు రూరల్‌, నవంబరు 10: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి గెలుపొందడం ఖాయమని ఆల్‌ ఇండియా బంజరా సంఘం నాయకులు శంకర్‌నాయక్‌ పవార్‌ అన్నారు. శంకర్‌నాయక్‌, భూకైలాస్‌ వ్యవస్థాపకులు వాసుపవార్‌లు శుక్రవారం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కలిశారు. ఎన్నికల్లో మద్దతు తెలపాలని ఎమ్మెల్యే కోరగా, తమ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యేతో తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. భారీ మెజార్టీతో పైలెట్‌ గెలుపు ఖాయమని ఈ సందర్భంగా వారు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

తాండూరులో రోహిత్‌రెడ్డి సతీమణి ప్రచారం

తాండూరు: పట్టణం తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్‌రెడ్డి సతీమణి ఆర్తిరెడ్డి శుక్రవారం తాండూరు పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటువేసి రోహిత్‌రెడ్డి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, కౌన్సిలర్‌ శోభారాణి పాల్గొన్నారు.

బీఆర్‌ఎ్‌సలో చేరికలు

తాండూరు పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్‌, బీజేపీ సీనియర్‌ నాయకులు బొప్పి సురేష్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్‌ఎస్‌ పథకాలతోనే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు బీజేపీ ముఖ్య కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు.

Updated Date - 2023-11-10T23:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising