ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైఎస్సార్‌ను మించిన పాలనకు రేవంత్‌ కృషి : వీర్లపల్లి

ABN, Publish Date - Dec 24 , 2023 | 11:56 PM

దివంగత ఏపీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిని మించిన సంక్షేమ పాలనను రేవంత్‌ రెడ్డి అందిస్తాడని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు.

అల్వాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

కేశంపేట, డిసెంబరు 24: దివంగత ఏపీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిని మించిన సంక్షేమ పాలనను రేవంత్‌ రెడ్డి అందిస్తాడని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. ఆదివారం కేశంపేట మండల కేంద్రంతో పాటు, అల్వాల, పాటిగడ్డ, బైర్కాన్‌పల్లి, మంగళగూడ గ్రామాల్లో కాంగ్రెస్‌ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ గెలుపునకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు. గత ప్రభుత్వంలాగా కక్ష సాధింపులు ఉండవని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ ప్రజల అభిమానాన్ని వెలకట్టలేమని, వారికి సుపరిపాలన అందిస్తామన్నారు. అంతకుముందు అల్వాలలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అలాగే బైర్కాన్‌పల్లిలో లక్ష్మీనరసింహ ఆలయంలో పూజలు నిర్వహించారు. మండలాధ్యక్షుడు వీరేశ్‌, జడ్పీటీసీ విశాలశ్రవణ్‌రెడ్డి, వై.యాదయ్యయాదవ్‌, జగదీశ్వర్ప, శ్రీధర్‌రెడ్డి, సురే్‌షరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, యాదగిరిచారి, తదితరులున్నారు.

ఏసుక్రీస్తును స్మరించుకుందాం

క్రిస్మస్‌ సందర్భంగా ఏసుక్రీస్తును స్మరించుకుందామని ఎమ్మెల్యే శంకర్‌ అన్నారు. క్రిస్మ్‌స ను పురస్కరించుకుని కేశంపేట మండల కేంద్రంతో పాటు, ఇప్పలపల్లి, పాపిరెడ్డిగూడ, పాటిగడ్డ చర్చిలలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలు ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి, కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డిలను సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు.

Updated Date - Dec 24 , 2023 | 11:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising