ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రేవంత్‌ సీఎం.. ఎన్నారైల హర్షం

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:22 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టడాన్ని హర్షిస్తూ శనివారం రాత్రి అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఎన్నారైలు సంబురాలు జరుపుకున్నారు.

రేవంత్‌ రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌ రెడ్డిని సన్మానిస్తున్న వినయ్‌

ఆమనగల్లు, డిసెంబరు 17: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టడాన్ని హర్షిస్తూ శనివారం రాత్రి అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఎన్నారైలు సంబురాలు జరుపుకున్నారు. టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికాలో ఉండే రేవంత్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌చేసి సంబురాలు జరుపుకున్నారు. రేవంత్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. రేవంత్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని వారు ఆకాక్షించారు. రాష్ట్రాభివృద్ధికి టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ తరఫున సహకారం అందిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ సెల్‌ నాయకులు రమణ, ప్రసాద్‌, కిరణ్‌, మధు, గిరిధర్‌, వినయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:22 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising