ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:34 PM

రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దడానికి కార్యాచరణ రూపొందిస్తుందని ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి అన్నారు.

ఆమనగల్లు, డిసెంబరు 18: రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దడానికి కార్యాచరణ రూపొందిస్తుందని ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య అందుతుందని ఆయన తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు సోమవారం ఐక్యత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్కాన్‌ అండ్‌ లర్న్‌ డిజిటల్‌ కంటెంట్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాఘవేందర్‌ రెడ్డి పాల్గొని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత జీవితం లభిస్తుందన్నారు. పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన కోరారు. హెచ్‌ఎం నిర్మల, మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, నాయకులు నిజాముద్దీన్‌, గోరటి శ్రీను, అనిల్‌గౌడ్‌, చంద్రకాంత్‌, శేఖర్‌, సైదులు, బాల్‌రాజ్‌, శ్రీనివాస్‌, జంగయ్య, రేష్మబేగం, ఝాన్సీ, ఐక్యత పౌండేషన్‌ సభ్యులు శ్రీనివా్‌సరెడ్డి, చంద్రశేఖర్‌, అబినవ్‌రెడ్డి,శ్రీరాములు, తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:34 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising