ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అధ్యక్షా.. అన్నారు!

ABN, Publish Date - Dec 14 , 2023 | 11:15 PM

శాసనసభలో అధ్యక్షా అనాలన్న తన చిరకాల వాంఛ నేటితో తీరిందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. గురువారం ప్రారంభమైన శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడారు.

వీర్లపల్లి శంకర్‌

చిరకాల వాంఛ నెరవేరింది : వీర్లపల్లి

షాద్‌నగర్‌, డిసెంబరు 14 : శాసనసభలో అధ్యక్షా అనాలన్న తన చిరకాల వాంఛ నేటితో తీరిందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. గురువారం ప్రారంభమైన శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త స్పీకర్‌ సభా మర్యాదలను కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం స్పీకర్‌ పోడియం దగ్గరికి వెళ్లి స్పీకర్‌తో పాటు అక్కడే ఉన్న సీఎం రేవంత్‌రెడ్డికి కూడా అభివాదం చేశారు.

ప్రసాద్‌కుమార్‌, నేనూ పవిత్ర స్నేహితులం : కాలె యాదయ్య

చేవెళ్ల : శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌, తాను పవిత్ర స్నేహితులమని, ఇద్దరం ఒకే నియోజకవర్గం నుంచి ఒకేసారి ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని వివరించారు. స్పీకర్‌గా ప్రసాద్‌కుమార్‌ సభలో సభ్యుల గౌరవ మర్యాదలు గౌరవిస్తూ సభను ముందుకు సాగిస్తారని ఆశిస్త్తున్నట్లు ఆయన ఆశభావం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 14 , 2023 | 11:15 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising