ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:44 PM

ప్రజావాణి కార్యక్రమంలో బాధితులు ఇచ్చే ఫిర్యాదలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హొలికేరీ అధికారులను అదేశించారు.

ప్రజల సమస్యలను వింటున్న కలెక్టర్‌ భారతి హొలికేరీ

జిల్లా కలెక్టర్‌ భారతిహొలికేరీ

రంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 18 : ప్రజావాణి కార్యక్రమంలో బాధితులు ఇచ్చే ఫిర్యాదలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హొలికేరీ అధికారులను అదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. సోమవారం మొత్తం 176 ఫిర్యాదులు అధికారులకు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై స్పందించాలన్నారు. బాధితుల నుంచి వచ్చిన అర్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో పెట్టరాదని ఆమె తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising