వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలి
ABN, Publish Date - Dec 31 , 2023 | 12:14 AM
సమాజంలో మహిళలు, యువతులపై జరుగుతున్న దురాగతాలను ధైర్యంగా ఎదుర్కోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సఖి కేంద్రం ఇన్‌చార్జి సలోమి అన్నారు.
మేడ్చల్ టౌన్, డిసెంబరు 30: సమాజంలో మహిళలు, యువతులపై జరుగుతున్న దురాగతాలను ధైర్యంగా ఎదుర్కోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సఖి కేంద్రం ఇన్‌చార్జి సలోమి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని స్ఫూర్తి జూనియర్ కళాశాల విద్యార్థినులకు శనివారం మహిళలపై జరిగే వేధింపుల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సలోమి మాట్లాడుతూ.. మహిళలు, యువతులు సమాజంలో అనేక విధాలుగా వేధింపులకు గురవుతున్నారని అన్నారు. అలాంటి వారిలో ధైర్యం నింపి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే విదంగా తీర్చి దిద్దుతున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా సఖి కేంద్రాలను ఏర్పాటు చేసాయని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా యువతులను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. మహిళలు, యువతులు ఎలాంటి వేధింపులకు గురైనా వారు వెంటనే1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, కళాశాల నిర్వాహకులు పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 12:14 AM