ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అధికారులు సమన్వయంతో పనిచేయాలి : ఎంపీపీ

ABN, Publish Date - Dec 14 , 2023 | 10:52 PM

అధికారులు అంకిత భావంతో పనిచేసి గ్రామాలలో సమస్యలు ఉత్ప న్నం కాకుండా చూడాలని ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌ కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌

కడ్తాల్‌, డిసెంబరు 14: అధికారులు అంకిత భావంతో పనిచేసి గ్రామాలలో సమస్యలు ఉత్ప న్నం కాకుండా చూడాలని ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌ కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నూతనంగా చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా చొరవ తీసుకోవాలని ఆమె కోరారు. కడ్తాల మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులపై చర్చించారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని సూచించారు. పథకాల అమలులో ఎక్కడా అక్రమాలకు తావివ్వొద్దని కోరారు. అసంపూర్తి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీపీ సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగి సమస్యల పరిష్కారం దిశగా చొరవ తీసుకోవాలన్నారు. మండల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధుల మంజూరుపై త్వరలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి నివేదిస్తానని కమ్లీమోత్యనాయక్‌ చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, డీటీ శ్రీనివాస్‌, ఎంపీవో మధుసూదనాచారి, ఎంఈవో సర్ధార్‌నాయక్‌, ఏవో శ్రీలత, పశువైద్య అధికారి భానునాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 10:52 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising