ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పత్తి కొనుగోళ్లపై అధికారి ఆరా!

ABN, Publish Date - Dec 14 , 2023 | 11:32 PM

‘అత్తెసరు కొనుగోళ్లు.. పత్తి అమ్మకాల్లో మోసాలు’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

రంగంపల్లి శివారులోని కాటన్‌ మిల్లును సందర్శించిన డీఏవో గోపాల్‌

కాటన్‌ మిల్లును సందర్శించిన డీఏవో

పరిగి, డిసెంబరు 14: ‘అత్తెసరు కొనుగోళ్లు.. పత్తి అమ్మకాల్లో మోసాలు’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ గురువారం పరిగి మండలం రంగంపల్లి శివారులోని కాటన్‌మిల్లును సందర్శించారు. పత్తి అమ్మకాల్లో రైతులకు కలుగుతున్న కష్టాలపై ఆరా తీశారు. పత్తి కొనుగోళ్ల వివరాలను పరిశీలించారు. డీఏవో మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తిసాగుకు సంబంధించి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదులేకుంటే, ఆప్‌లైన్‌లో ఏఈవో, ఆర్‌ఐలు ధ్రువీకరణ పత్రం ఇస్తే రైతులను ఇబ్బందులు పెట్టకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. మద్దతు ధరకు తక్కువ కాకుండా పత్తి కొనుగోలు చేయాలన్నారు. పత్తి కొన్న వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఏవో ప్రభాకర్‌రెడ్డి, మార్కెటింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 11:32 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising