ఆర్.కృష్ణయ్యతో ఎమ్మెల్యే భేటీ
ABN, First Publish Date - 2023-10-30T23:53:00+05:30
హైదరాబాద్‌లో సోమవారం బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను తాండూరు ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి రోహిత్‌రెడ్డి భేటీ అయ్యారు.
కృష్ణయ్యను సన్మానిస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, అక్టోబరు 30: హైదరాబాద్‌లో సోమవారం బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను తాండూరు ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి రోహిత్‌రెడ్డి భేటీ అయ్యారు. బీసీ సామాజిక వర్గానికి చేసిన కార్యక్రమాలను వివరించారు. బీసీ సమీకృత భవనం నిర్మాణానికి రెండెకరాల స్థలంతో పాటు రూ.2కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఆర్.కృష్ణయ్యను రోహిత్‌రెడ్డి కోరారు. తన మద్దతుతో పాటు బీసీల మద్దతు రోహిత్‌రెడ్డికి అందిస్తామని బీసీలతో సభ ఏర్పాటు చేస్తే ప్రచారానికి వస్తానని ఆర్.కృష్ణయ్య ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.
Updated Date - 2023-10-30T23:53:00+05:30 IST