ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆరోగ్య సమాజ నిర్మాణానికి ధ్యానం గొప్ప సాధనం

ABN, Publish Date - Dec 28 , 2023 | 11:58 PM

భారతీయుల ధ్యాన మార్గం ఆరోగ్య సమాజ నిర్మాణానికి, శాంతిస్థాపనకు దోహద పడుతుందని పీఎ్‌సఎ్‌సఎం గ్లోబల్‌ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ, పిరమిడ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కోర్పోలు విజయ భాస్కర్‌ రెడ్డిలు అన్నారు.

ధ్యాన మహాయాగంలో ధ్యానులు

పీఎ్‌సఎ్‌సఎం గ్లోబల్‌ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ

8వ రోజుకు చేరిన ధ్యాన మహాయాగం వేడుకలు-2

తరలివస్తున్న ధ్యానులు, సందర్శకులు

ఆకట్టుకున్న కళాకారుల నృత్య రూపకాలు

కడ్తాల్‌, డిసెంబరు 28 : భారతీయుల ధ్యాన మార్గం ఆరోగ్య సమాజ నిర్మాణానికి, శాంతిస్థాపనకు దోహద పడుతుందని పీఎ్‌సఎ్‌సఎం గ్లోబల్‌ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ, పిరమిడ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కోర్పోలు విజయ భాస్కర్‌ రెడ్డిలు అన్నారు. ధ్యానం ద్వారా సంకల్ప శక్తి సిద్ధిస్తుందని.. అది వ్యక్తి పురోగమనానికి దోహద పడుతుందని వారు అన్నారు. కడ్తాల మండలం అన్మా్‌సపల్లి సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్‌లో పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకలు-2 అట్టహాసంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ధ్యానులు, సాధకులు, సందర్శకులు, పిరమిడ్‌ మాస్టర్లు, ఆధ్యాత్మికవేత్తలు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. వేడుకలు గురువారం 8వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం ఐదు గంటల నుంచి 8 గ ంటల వరకు సరస్వతి ప్రాంగణంలో సభావేదిక వద్ద ప్రాతకాలం ధ్యానం నిర్వహించారు. ప్రపంచ ధ్యాన గురువు దివంగత సుభాష్‌ పత్రీజీ ధ్యాన, ఆధ్యాత్మిక సందేశాల వీడియోలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. పత్రీజీ శక్తిస్థల్‌ను ధ్యానులు సందర్శించి నివాళులర్పించారు. ధ్యానులు పిరమిడ్‌లోని కింగ్‌ చాంబర్‌ను సందర్శించి ధ్యానంలో లీనులయ్యారు. ఈ సందర్భంగా ధ్యానులనుద్దేశించి పరిమళ పత్రీ, విజయభాస్కర్‌ రెడ్డిలు మాట్లాడుతూ బీద, ధనిక తారతమ్యం లేకుండా భారతీయులకు ధ్యానం నేర్పిన గురువు సుభాష్‌ పత్రీజీ అన్నారు. ధ్యానంతో ఆత్మ స్థితిని, సంకల్ప శక్తిని పొందవచ్చన్నారు. సంగీతానికి శృతి ఎలాంటిదో ఆత్మకు ధ్యానం అలాంటిందని వారు తెలిపారు. ప్రతిఫలం ఆశించకుండా పత్రీజీ జీవిత పర్యంతం నిస్వార్థ సేవలు అందించారని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, పిరమిడ్‌ మాస్టర్లు కొనియాడారు. ఆగస్టు 15న చార్మినార్‌ వద్ద లక్ష మందితో శాఖాహార ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పీఎ్‌సఎ్‌సఎం ధ్యాన భాగ్యనగర్‌ ట్రస్టీ లక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ సభ్యులు దాట్ల హన్మంతరాజు, బాలకృష్ణ, నవకాంత్‌, ఆనంద్‌, జగపతి రాజు, వాణి, మాధవి, కిషన్‌రెడ్డి, దామోదర్‌ రెడ్డి, కసిరెడ్డి జ్యోతి, అన్మా్‌సపల్లి సర్పంచ్‌ శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ధ్యాన మహోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు కళాప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ, ఏపీకి చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. మహిళల నృత్యాలు, యువతీయువకుల నృత్యరూపకాలు అదరహో అనిపించాయి. సాయింత్రం నుంచి అర్ధరాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొన సాగాయి.

ధ్యాన, ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

ధ్యాన, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి పలువురు ధ్యానులు, ఆధ్యాత్మికవేత్తలు రచించి రూపొందించిన పుస్తకాలను మాస్టర్లతో కలిసి పరిమళ పత్రీ, విజయభాస్కర్‌ రెడ్డిలు ఆవిష్కరించారు. ఆయా పుస్తకాలను ధ్యానులు, ప్రముఖులకు అందచేశారు. రచయితలను సత్కరించి అభినందించారు.

Updated Date - Dec 28 , 2023 | 11:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising