మర్లకుంట, మంగలితండాలను జీపీలుగా ఏర్పాటు చేయాలి
ABN, Publish Date - Dec 23 , 2023 | 11:58 PM
మండలంలోని మర్లకుంట తండా, మంగలిగడ్డ తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని కుర్మిద్ద సర్పంచ్ బి.రాజశేఖర్‌రెడ్డి, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాటకమిటీ నాయకులు శ్రీకాంత్‌నాయక్ తదితరులు పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు.
యాచారం, డిసెంబరు 23 : మండలంలోని మర్లకుంట తండా, మంగలిగడ్డ తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని కుర్మిద్ద సర్పంచ్ బి.రాజశేఖర్‌రెడ్డి, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాటకమిటీ నాయకులు శ్రీకాంత్‌నాయక్ తదితరులు పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. శనివారం నగరంలోని మంత్రి నివాసంలో కలిసి సత్కరించారు. అనంతరం పలు సమస్యలను మంత్రికి ఎకరువు పెట్టారు. సర్పంచ్‌తో పాటు కుర్మిద్ద గ్రామస్తుల సమస్యలను మంత్రి సావధానంగా విన్నారు. రెండు తండాలను కలిపి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటుచేసే అంశంపై సంబంధిత అధికారులతో నివేదిక తెప్పించి న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. కుర్మిద్ద గ్రామపంచాయతీకి నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరడంతో సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో తాటిపర్తి సర్పంచ్ డి.రమేష్ తదితరులు ఉన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 11:58 PM