ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మహేశ్వరం ప్రజలకు రుణపడి ఉంటా

ABN, First Publish Date - 2023-12-05T23:16:32+05:30

మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని.. ప్రతిపక్షంలో ఉండి ప్రజాసమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.

సబితాఇంద్రారెడ్డిని కలిసిన నేదునూరు సర్పంచ్‌ రామకృష్ణారెడ్డి, నాయకులు అమరేందర్‌రెడ్డి, రూప్‌చందర్‌

ప్రతిపక్షంలో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి

కందుకూరు, డిసెంబరు 5 : మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని.. ప్రతిపక్షంలో ఉండి ప్రజాసమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మొన్నటి ఎన్నికల్లో మహేశ్వరం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సబితాఇంద్రారెడ్డిని మంగళవారం మండలంలోని నేదునూరు, బాచుపల్లి, గూడూరు, తదితర గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నేతలు నగరంలోని ఆమె నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత ్వంలో, కేసీఆర్‌ నేతృత్వంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల్లో తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీచినప్పటికీ తనకు మరోసారి అవకాశం ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయనున్నట్లు హామీ ఇచ్చారు. సబితను కలిసినవారిలో నేదునూరు, బాచుపల్లి గ్రామాల సర్పంచ్‌లు కాసుల రామకృష్ణారెడ్డి, యాలాల శ్రీనివాస్‌, ఎంపీటీసీ సురేష్‌, నాయకులు ఎస్‌.వెంకటే్‌షగౌడ్‌, ఐనవోలు శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌.బాల్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, ఉన్ని వెంకటయ్య, నర్సింహ, కాకి రవీందర్‌ముదిరాజ్‌, ఎగిరిశెట్టి రాజు, కత్తుల వెంకటేష్‌, ఎండీ జాంగీర్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-12-05T23:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising