ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లోక్‌ అదాలత్‌లను వినియోగించుకోవాలి

ABN, Publish Date - Dec 30 , 2023 | 11:55 PM

లోక్‌ అదాలత్‌లను వినియోగించుకోవాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ సీఎం రాజ్యలక్ష్మి తెలిపారు. షాద్‌నగర్‌ కోర్టు కాంప్లెక్స్‌లో శనివారం మెగా లోక్‌అదాలత్‌ నిర్వహించారు.

షాద్‌నగర్‌ రూరల్‌, డిసెంబరు 30: లోక్‌ అదాలత్‌లను వినియోగించుకోవాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ సీఎం రాజ్యలక్ష్మి తెలిపారు. షాద్‌నగర్‌ కోర్టు కాంప్లెక్స్‌లో శనివారం మెగా లోక్‌అదాలత్‌ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ లోక్‌అదాలత్‌ ద్వారా కక్షిదారులకు మేలు జరుగుతుందన్నారు. 3 సివిల్‌కేసులు, 450 క్రిమినల్‌ కేసులు, డ్రంక్‌ ఆండ్‌ డ్రైవ్‌ కేసులు 444, పిటీ కేసులు 4650 పరిష్కరించినట్లు తెలిపారు. విశ్రాంత అడిషనల్‌ జిల్లా జడ్జి రవీంద్రసింగ్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి సూరజ్‌ సింగ్‌, అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ధీరజ్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఏసీపీ చంద్రశేఖర్‌, ఏసీపీ రంగస్వామి, ఇన్‌స్పెక్టర్‌ ప్రతా్‌పలింగం, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

రాజీమార్గంతో కేసుల పరిష్కారం

చేవెళ్ల : రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని చేవెళ్ల సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్‌కుమార్‌, రిటైర్డ్‌ జడ్జి సాంబశివరావు అన్నారు. చేవెళ్ల కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. సివిల్‌ కేసులతో పాటు మొత్తం ట్రాఫిక్‌ కేసులు 2857 కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. రూ.19లక్షల 51వేల 481 జరిమానాలు విధించినట్లు తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.శ్రీనివా్‌సరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, న్యాయవాదులు మల్లేశ్‌, రాజశేఖర్‌, ట్రాఫిక్‌ సీఐ సైదులు, లక్ష్మారెడ్డి, యాదయ్య, ఎస్సైలు విఠల్‌రెడ్డి, ట్రాఫిక్‌ పోలీ్‌సలు, కోర్టు అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

రాజీమార్గమే రాజమార్గం

ఆమనగల్లు : రాజీమార్గమే రాజమార్గమని ఆమనగల్లు జూనియర్‌ సివిల్‌ జడ్జి కాటం స్వరూప అన్నారు. పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ చక్కటి వేదిక అని తెలిపారు. ఆమనగల్లు పట్టణంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల పోలీసుస్టేషన్ల పరిధి క్రిమినల్‌, పిటీ, ఎక్సైజ్‌, ట్రా ఫిక్‌, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు ఇరువర్గాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించారు. ఏ పీపీ కార్తీక్‌, లోక్‌అదాలత్‌ సభ్యుడు, న్యాయవాది దుడ్డు ఆంజనేయులు, రామకృష్ణ, సీఐలు శివప్రసాద్‌, వెంకటేశ్వర్లు, బద్యనాథ్‌చౌహాన్‌, ఎస్‌ఐలు బాల్‌రామ్‌నాయక్‌, హరిశంకర్‌గౌడ్‌, శ్రీను, న్యా యవాదులు వి.లక్ష్మణశర్మ, ఎర్రవోలు శేఖర్‌, వ స్పుల మల్లేశ్‌, గణేశ్‌, సంతోష్‌, ఆంజనేయులు, దేవేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 11:55 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising