లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి
ABN, Publish Date - Dec 23 , 2023 | 11:52 PM
లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని ఇబ్రహీంపట్నం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి శ్రీదేవి అన్నారు. ఇబ్రహీంపట్నం కోర్టు పరిధిలో శనివారం జాతీయ ప్రీలోక్ అదాలత్‌లో మొత్తం 1933 కేసులు పరిష్కరించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.
ఇబ్రహీంపట్నం, డిసెంబరు 23: లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని ఇబ్రహీంపట్నం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి శ్రీదేవి అన్నారు. ఇబ్రహీంపట్నం కోర్టు పరిధిలో శనివారం జాతీయ ప్రీలోక్ అదాలత్‌లో మొత్తం 1933 కేసులు పరిష్కరించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ఈ-చలాను,్ల పిటీ కేసులకు సంబంధించి ఆదిభట్ల పీఎస్ పరిధిలో 171, మంచాల పీఎస్ పరిధిలో 657, యాచారం పీఎస్ పరిధిలో 220, ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో 800, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో 49 కేసులు పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఎఫ్‌ఐఆర్ కేసుల్లో మంచాల పీఎస్ పరిధిలో 6, యాచారం పీఎస్ పరిధిలో 5, ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో 6, ఆదిభట్ల పీఎస్ పరిధిలో 19 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, ప్రిన్సిపల్ సివిల్ జూనియర్ జడ్జి జస్వంత్ సింగ్ చౌహాన్, మహేశ్వరం డీసీపీ సీ.హచ్ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు
చేవెళ్ల : మద్యం సేవించి వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమని రిటైర్డ్ జడ్జి సాంబశివరావు అన్నారు. శనివారం చేవెళ్ల కోర్టు ఆవరణలో చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్‌ల ఆధ్వర్యంలో లోక్‌అదాలత్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తం 220కేసులు పరిష్కరించడంతో పాటు మొత్తం రూ.5లక్షల21వేలు జరిమానా విధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సైదులు, ఎస్సై విఠల్‌రెడ్డి, కోర్టు సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్‌లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 11:52 PM