ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి

ABN, First Publish Date - 2023-12-05T23:34:54+05:30

విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిచాలన్న ఉద్దేశ్యంతో కళాశాలలో స్టూడెండ్‌ యాక్షన్‌ కమిటీ ప్రారంభించామని గుండ్లపోచంపల్లి మైసమ్మగూడ నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల చైర్మన్‌ జక్కల నర్సింహ్మారెడ్డి అన్నారు.

ఎన్‌ఆర్‌సీఈలో ఎంపిక చేసిన విద్యార్థి సంఘం సభ్యులు

మేడ్చల్‌ టౌన్‌, డిసెంబరు 5: విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిచాలన్న ఉద్దేశ్యంతో కళాశాలలో స్టూడెండ్‌ యాక్షన్‌ కమిటీ ప్రారంభించామని గుండ్లపోచంపల్లి మైసమ్మగూడ నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల చైర్మన్‌ జక్కల నర్సింహ్మారెడ్డి అన్నారు. కళాశాలలో మంగళవారం విద్యార్థి సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి నర్సింహారెడ్డి మాట్లాడారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడే వారు భవిష్యత్తులో అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలరన్నారు. నాయకత్వ లక్షణం ప్రతీ విషయంలో కమాండింగ్‌ను పెంచుతుందన్నారు. నాయకత్వం కేవలం రాజకీయ రంగానికే పరిమితం కాదన్నారు. అన్ని రంగాల్లో నాయకత్వ లక్షణం వ్యక్తి ఎదుగుదలకు దోహద పడుతుందన్నారు. తమ కళాశాల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణం వృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతో స్టూడెంట్‌ యాక్షన్‌ కమిటీ ప్రారంభించామని తెలిపారు. యాక్షన్‌ కమిటీ సభ్యులను నర్సింహారెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశా కార్యదర్శి త్రిశూల్‌రెడ్డి, కరస్పాండెంట్‌ జక్కుల సంగీతారెడ్డి, డైరెక్టర్‌ డాక్టర్‌ మోహన్‌ బాబు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లోకనాథం, డీన్‌ రామదాసు, త్రిలోక్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-05T23:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising