ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మంత్రి పదవి కోసం కసిరెడ్డి యత్నం

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:11 PM

మంత్రి పదవి కోసం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆశలు పెంచుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలకవర్గంలో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

ఆమనగల్లు, డిసెంబరు 17: మంత్రి పదవి కోసం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆశలు పెంచుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలకవర్గంలో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి, పలువురు జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల ద్వారా తన ప్రయత్నాన్ని సాగిస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిని కూడా కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. తలకొండపల్లి మండలం ఖానాపూర్‌ గ్రామానికి చెందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి 2014లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. తొలిసారిగా 2014లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2015 మార్చిలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2016 జనవరి 6న జరిగిన స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో పోటీలో నిలిచి తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2022 జనవరి 28న రెండోసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్రిలియంట్‌ సంస్థల అధినేతగా రాష్ట్ర స్థాయిలో నారాయణరెడ్డికి గుర్తింపు ఉంది. ఎమ్మెల్సీగా ఉండి పార్టీలో చేరి ప్రజాభిమానంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు అవకాశం కల్పించాలని కసిరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌లోకి ఇంకా ఆరుగురిని మంత్రులుగా తీసుకోవాల్సి ఉంది. వారిలో నారాయణరెడ్డికి అవకాశం కల్పించాలని కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. కాగా, ఉన్నత విద్యావంతుడైన కసిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఉపా ధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఈ సందర్భంగా కోరుతున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:12 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising