నిష్పక్షపాతంగా పథకాల అమలు
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:26 PM
సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించాలన్నదే కాంగ్రెస్ ప్రజా పాలన ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.
ఆమనగల్లు, డిసెంబరు 17: సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించాలన్నదే కాంగ్రెస్ ప్రజా పాలన ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ప్రజాభీష్టానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు రూపొందించి నిష్పక్షపాతంగా అమలు చేస్తుందని అన్నారు. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, వెల్దండ మండలాల పరిధిలో ఆదివారం కసిరెడ్డి నారాయణ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్ నియోజకవర్గ ఆయా మండలాల నేతలతో కలిసి పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కడ్తాల ముస్లిం మైనార్టీ సంఘం, పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. అభివృద్ధి పనులపై పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో రెండు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. విపక్షాలు విమర్శలు వీడి అభివృద్ధి విషయంలో ప్రభుత్వంతో కలిసి రావాలని కసిరెడ్డి కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి, కేఎల్‌ఐ డీ-82 కాల్వ ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ఆదర్శంగా నిలుపుతామని కసిరెడ్డి చెప్పారు. ఇందుకు ప్రజలంతా ప్రభుత్వంతో కలిసి రావాలని ఆయన కోరారు. ఆయా కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు, నాయకులు భట్టు కిషన్ రెడ్డి, రఘురాములు, వెంకట్రామ్‌రెడ్డి, మిట్టపల్లి అంజయ్య, నంద్యనాయక్, జ యమ్మ, వెంకటనారాయణరెడ్డి, శేఖర్, జహంగీర్‌బాబా, అబ్దుల్ రాహూఫ్, జావేద్, జహంగీర్‌అలీ, అహ్మద్‌జానీ, లాయక్‌అలీ, అబ్దుల్ వాహబ్, ఇమ్రాన్ బాబా, సతీఫ్, గౌస్, హమీద్, రఫీక్, ఓం ప్రకాశ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, యాదగిరిరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, సుమతి, లక్ష్మారెడ్డి, తదితరులున్నారు. కాగా, తలకొండపల్లి మండలం ఖానాపూర్ సమీపంలో స్వయం ఉపాధిలో భాగంగా నాగేశ్ ఏర్పాటుచేసిన ఫంక్షన్‌హాల్‌ను కసిరెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్‌లతో కలిసి ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ప్రారంభించారు.
Updated Date - Dec 17 , 2023 | 11:26 PM