ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సింగరేణిలో ఎర్రజెండా ఎగరడం సంతోషం

ABN, Publish Date - Dec 28 , 2023 | 11:52 PM

సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామస్వామి, మండల ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల సత్యనారాయణచారి అన్నారు.

చేవెళ్ల, డిసెంబరు 28 : సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామస్వామి, మండల ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల సత్యనారాయణచారి అన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై పార్టీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్ల తర్వాత ఏఐటీయూసీకి కార్మికులు పట్టం కట్టడం సంతోషకరమన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలకు భవిష్యత్‌లో కార్మికులు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి శివ, సహాయ కార్యదర్శి మక్బూల్‌, నాయకులు మంజుల, విజయమ్మ, యాదమ్మ, అనసూయ, స్వరూప, యాదగిరి, ఆనంద్‌, సత్యనారాయణ, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 11:52 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising