ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా కార్తీక పూజలు

ABN, First Publish Date - 2023-12-10T23:02:50+05:30

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చందిప్పలో గల మరకత శివలింగ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన,లక్ష తులసి అర్చన నిర్వహించారు.

పూజాల్లో పాల్గొన్న భక్తులు

శంకర్‌పల్లి, డిసెంబరు 10: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చందిప్పలో గల మరకత శివలింగ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన,లక్ష తులసి అర్చన నిర్వహించారు. కాలభైరవ స్వామికి రుద్రాభిషేకం, శ్రీశైలం అడవుల నుంచి తెచ్చిన 108 రకాల వనమూలికలతో మూలికాభిషేకం, వెయ్యి లీటర్లతో పంచామృతాభిషేకం, క్వింటా పసుపుకుంకుమతో గౌరీశంకర అభిషేకం, 100 కిలోల బూడిదతో భస్మాభిషేకం, 200కిలోల ఫలాభిషేకం, సువర్ణాభిషేకం, కోటి పుష్పాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. 11వ శతాబ్దంలో చాణుక్యులు ప్రతిష్ఠించిన బ్రహ్మసుత్రం గల మరకత శివలింగానికి రకరకాల అభిషేకాలు చేయడం పూర్వజన్మ సుక్రుతం అని భక్తులు అన్నారు. సాయంత్రం భక్తులు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించింది. మధ్యాహ్నం అన్నదానాన్ని నిర్వహించింది. పూజల్లో చైర్మన్‌ సదానందంగౌడ్‌, దయాకర్‌, భూపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising