విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN, Publish Date - Dec 31 , 2023 | 12:00 AM
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధి కుమ్మరిగూడ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. షాబాద్ ఎస్సై మహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు..
షాబాద్, డిసెంబరు 30 : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధి కుమ్మరిగూడ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. షాబాద్ ఎస్సై మహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని కుమ్మరిగూడకు చెందిన తీమ్ కృష్ణయ్య(56)కు వ్యవసాయ పొలం వద్ద బోరుమోటరు ఉంది. అయితే, శనివారం విద్యుత్ అంతరాయం కారణంగా మోటారు నడవకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి చూశాడు. ఈక్రమంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద తెగిపడిన విద్యుత్ తీగ కృష్ణయ్యకు తగలింది. కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Updated Date - Dec 31 , 2023 | 12:00 AM