ఎక్సైజ్ దాడులు.. 30 లీటర్ల నాటుసారా స్వాధీనం
ABN, First Publish Date - 2023-11-10T23:43:34+05:30
ఆమనగల్లు ఎక్సైజ్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల, మాడ్గుల మండలాల పరిధిలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు.
ఆమనగల్లు, నవంబరు 10 : ఆమనగల్లు ఎక్సైజ్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల, మాడ్గుల మండలాల పరిధిలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఏఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో సీఐలు సుభాష్, శ్రీనివాస్, సత్యనారాయణ, బద్యనాథ్ చౌహాన్, సిబ్బంది దాడులు చేపట్టారు. ఈమేరకు కడ్తాల మండలం రేఖ్య తండాలో 30 లీటర్ల నాటు సారా సీజ్ చేసి, 4,600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. నాటుసారా తయారీ, విక్రయాలు సాగిస్తున్న మంగ్లీ, సాలి, చావులీలను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.
Updated Date - 2023-11-10T23:43:35+05:30 IST