గుప్తనిధుల కోసం తవ్వకాలు
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:39 PM
గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని తొలగించి తవ్వకాలు చేపట్టారు. ఈ ఘటన యాలాల మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
యాలాల, డిసెంబరు 17: గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని తొలగించి తవ్వకాలు చేపట్టారు. ఈ ఘటన యాలాల మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యాలాల-విశ్వనాథ్‌పూర్ రోడ్డు మార్గంలో యాలాల గ్రామానికి చెందిన జి.వెంకట్‌రెడ్డి, వ్యవసాయ పొలం ఉంది. ఆయన పొలంలో పురాతన శివలింగం ఉంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి శివలింగాన్ని తొలగించి తవ్వారు. ఆదివారం ఉదయం పొలం యజమాని వెంకట్‌రెడ్డి పొలానికి వచ్చేసరికి శివలింగం తొలగించి తవ్వారని గమనించాడు. పక్కనే తాగి పడేసిన బాటిళ్లు, ఇతర వస్తువులు ఉన్నాయి. దీంతో వెంటనే యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - Dec 17 , 2023 | 11:39 PM