ఎమ్మెల్యే మల్‌రెడ్డి చొరవతో గ్రామాల అభివృద్ధి
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:28 PM
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చొరవతో ఇబ్రహీంపట్నం పట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తుందని కాంగ్రెస్ నాయకుడు, ఆరుట్ల సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
మంచాల, డిసెంబరు 17 : ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చొరవతో ఇబ్రహీంపట్నం పట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తుందని కాంగ్రెస్ నాయకుడు, ఆరుట్ల సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మల్‌రెడ్డి రంగారెడ్డి గెలుపు ఆకాంక్ష నెరవేరడంతో లోయపల్లి గ్రామానికి చెందిన దోసపాటి దాసుగౌడ్ ఆదివారం మంచాల మండల పరిధి లోయపల్లి నుంచి ఇబ్రహీంపట్నం కట్టమైసమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, చీమల జంగయ్యయాదవ్, జెనిగే వెంకటేష్, మాజీఎంపీపీ శ్రీనివా్‌సనాయక్, కారింగ్ జంగయ్య, లాలూనాయక్, మిద్దె శ్రీని వాస్‌గౌడ్, చెరుకు గణేష్, మోతీలాల్, స్వామి, గణేష్ తదితరులు దాసుగౌడ్ పాదయాత్రకు సంఘాభావం తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
Updated Date - Dec 17 , 2023 | 11:28 PM