ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కష్టాల సాగు

ABN, Publish Date - Dec 29 , 2023 | 12:17 AM

ప్రకృతి పగబట్టింది. 2023 సంవత్సరం రైతులకు కలిసిరాలేదు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య రైతుల వివిధ పంటలు సాగు చేసినా ప్రకృతి వైపరిత్యాలతో తీవ్రంగా నష్టపోయారు.

ఈ ఏడాదీ రైతులకు కలిసిరాని కాలం

అనుకూలించని వాతావరణం

రైతుల అంచనాలు తలకిందులు

దిగుబడి అంతంతే.. దక్కని గిట్టుబాటు

వెంటాడిన నకిలీ విత్తనాలు, తెగుళ్ల బెడద.. రైతులకు తప్పని నష్టాలు

రైతన్న మళ్లీ నష్టాలనే మూటగట్టుకున్నాడు. ప్రకృతితో పాటు వ్యాపారులూ వారిని నిలువునా ముంచారు. వరుణుడు కురవాల్సిన సమయంలో ముఖం చాటేసి.. పంట చేతికొచ్చే సమయంలో తన ప్రతాపాన్ని చూపాడు. దీంతో రైతులు రెండు విధాలుగా నష్టపోయారు. విత్తనాల సమయంలోనే నకిలీవి అంటగట్టిన వ్యాపారుల మొదలు.. పండిన పంటను కొనుగోలు చేసే వ్యాపారుల వరకు అందరి చేతుల్లోనూ రైతు దగా పడ్డాడు. కనీసం ప్రభుత్వమైనా ఆదుకోకపోతుందా అని ఆశగా ఎదురు చూసిన రైతుకు అశనిపాతమే ఎదురైంది. ఇటు ప్రకృతి సహకరించక.. అటు ప్రభుత్వాలు ఆదుకోక నష్టాల ఊబిలో చిక్కుకున్నాడు.

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 28 : ప్రకృతి పగబట్టింది. 2023 సంవత్సరం రైతులకు కలిసిరాలేదు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య రైతుల వివిధ పంటలు సాగు చేసినా ప్రకృతి వైపరిత్యాలతో తీవ్రంగా నష్టపోయారు. వాతావరణంలో మార్పులతో తెగుళ్ల ఉధృతి పెరిగి దిగుబడి పడిపోయింది. రైతుల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కనీసం పెట్టుబడులైనా చేతికొస్తాయనుకుంటే రైతులకు నిరాశే మిగిలింది. వరి పంట సాగు చేసిన రైతులు పంట అమ్ముకునేందుకు నానా కష్టాలు పడ్డారు. పత్తిసాగులో నకిలీల బెడద రైతులను వెంటాడింది. సీజన్‌ ప్రారంభంలో వర్షాలు ఎక్కువగా ఉండటంతో తెల్లబంగారం తెల్లబోయింది. తెగుళ్ల బాధ తప్పలేదు. వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదు. జిల్లాలో 80శాతం వ్యవసాయం జీవనాధారం. వ్యవసాయాన్నే నమ్ముకున్న చాలామంది రైతులు అప్పుల ఊబిలోకి నెట్టుకుపోయారు.

వెంటాడిన ’నకిలీ’లు

ఈ ఏడాది కూడా రైతులకు నకిలీ విత్తనాల బెడద తప్పలేదు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై వ్యవసాయాధికారులు దాడులు నిర్వహిస్తున్నా వ్యాపారులు ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. రైతుల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు వారికి నకిలీ పత్తి విత్తనాలు అంటగడుతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు. ప్రతి సంవత్సరం వ్యవసాయ, పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుంటున్నా వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు.

అనుకూలించని వాతావరణం

వానాకాలం సీజన్‌లో నైరుతి రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో సీజన్‌ ఆరంభంలో వర్షాలు కురవలేదు. రైతులు పత్తి విత్తనాలను విత్తుకున్నా.. వర్షాలు రాకపోవడంతో అవి మొలకెత్తలేదు. దీంతో రైతులు రెండోసారి విత్తనాలు విత్తుకోవాల్సి వచ్చింది. దీంతో వారిపై అదనపు భారం పడింది. జిల్లా వాప్తంగా వానాకాలం సీజన్‌లో 1,32,523 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. తీరా పూత, కాత దశకు వచ్చే సమయంలో వానలు రాకపోవడంతో చేలు వాడుముఖం పట్టాయి. సెప్టెంబరు, అక్టోబరులో తుఫాన్‌ రావడంతో పత్తిచేలకు ప్రాణం పోసింది. అయినా చేలపై ఉన్న పత్తికాయలు దెబ్బతిని దిగుబడి సగానికి పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా 1,03,000 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 12,929.79 మెట్రిక్‌ టన్నులు సీసీఐ రైతుల నుంచి సేకరించింది. క్వింటాకు రూ.7వేలకు మించి ధర రాకపోవడంతో రైతులు పెట్టుబడులు కూడా మీదపడి నష్టపోయారు. అలాగే ఈ సీజన్‌లో వరి 1,32,559 ఎకరాల్లో సాగు చేశారు. 33 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 8,376.400 మెట్రిక్‌ టన్నులు సేకరించారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలు రూ. 2,203 ఉంది. అయితే బయట మార్కెట్‌లో 3,100 చెల్లిస్తుండటంతో రైతులకు కొంత కలిసి వచ్చింది.

బిందు, తుంపర సేద్యానికి ప్రోత్సాహం కరువు

జిల్లాలో బిందు, తుంపర సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం కరువైంది. ఈ పథకం మూడేళ్ల్ల నుంచి అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలో బిందుసేద్యం ద్వారా సాగు గణనీయంగా పడిపోయింది. బిందు సేద్యం కోసం దరఖాస్తు చేసుకుని రోజులు, నెలలు, సంవత్సరం దాటి మూడేళ్లవుతున్నా.. పరికరాలు అందకపోవడంతో పంటలకు నీళ్లందించేందుకు రైతన్నలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో మూడేళ్ల కాలంలో సుమారు 4,500మంది రైతులు బిందుసేద్యం కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.

పరిహారం కోసం ఎదురుచూపులు

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రాకుండా పోయింది. ప్రకృతి విపత్తు పంటను పాడు చేసింది. అధికారులు నస్టాన్ని అంచనా వేయడం తప్ప.. పరిహారం అందించే దిశగా చర్యలు చేపట్టలేదు. వరి, పత్తి, మొక్కజొన్న వంటి సాధారణ పంటలే కాకుండా పూలు, పండ్లు, కూరగాయల వంటి ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ అధికారులు పంట నష్టం అంచనా వేసి నివేదికలు ప్రభుత్వానికి సమర్పించి చేతులు దులుపుకున్నారన్న రైతులు విమర్శిస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌లలో ఏర్పడిన అతివృష్టి కారణంగా జిల్లాలో 1,813మంది రైతులకు చెందిన 2,392.42 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. జిల్లాలోని మంచాల, యాచారం, తలకొండపల్లి, షాబాద్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, మాడ్గుల, మహేశ్వరం, చౌదరిగూడ, కేశంపేట, ఇబ్రహీంపట్నం, కడ్తాల్‌, ఆమనగల్లు మండలాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం కేవలం రూ. 2.39కోట్లు మాత్రమే విడుదల చేసింది. అయితే, అవికూడా రైతుల ఖాతాల్లో జమ కాలేదు.

సకాలంలో అందని రుణమాఫీ..

గత ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం రైతుల రుణాలను సకాలంలో మాఫీ చేయకపోవడంతో రైతులు తీసుకున్న రుణానికి వడ్డీలు పెరిగి నానా ఇబ్బందులు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 65,020మంది రైతులకు 348 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. మిగతా వారికి రుణమాఫీ కాలేదు.

మృతిచెందిన రైతుల కుటుంబాలకు బీమా

జిల్లాలో 2022-23 అక్టోబరు వరకు 970 డెత్‌ క్లెయిమ్స్‌ నమోదయ్యాయి. అందులో 925మంది రైతు కుటుంబాలకు రూ.4,625లక్షలు అందించారు. మిగతా 55డెత్‌ క్లెయిమ్స్‌ అందజేయాల్సి ఉంది.

Updated Date - Dec 29 , 2023 | 12:17 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising