రాజకీయాలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధి
ABN, Publish Date - Dec 28 , 2023 | 12:27 AM
బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో రాజకీయాలకు అతీతంగా గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేశామని, నేడు బీఆర్‌ఎస్ అధికారంలో లేకపోయినా మహేశ్వరం నియోజకవర్గాన్ని రాజకీయాలతో సంబ ంధం లేకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
మహేశ్వరం, డిసెంబరు 27 : బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో రాజకీయాలకు అతీతంగా గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేశామని, నేడు బీఆర్‌ఎస్ అధికారంలో లేకపోయినా మహేశ్వరం నియోజకవర్గాన్ని రాజకీయాలతో సంబ ంధం లేకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఆకన్‌పల్లిలో నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం గట్టుపల్లి రోడ్డు విస్తరణ, చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని రోడ్ల విస్తరణ పనులకు కోట్లాది రూపాయలు నిధులు విడుదల చేయించామని, అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయిస్తామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కాగా, ఘట్టుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. టీచర్ స్థానంలో ఉండి విద్యార్థులను పలు రకాల ప్రశ్నలు అడిగి వారి ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఎంపీపీ ఆర్ సునితాఅంద్యానాయక్, సర్పంచులు, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం, ప్రభాకర్, రాజునాయక్ తదితరులు ఉన్నారు.
రేపు అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
కందుకూరు : మండలంలోని కొత్తూరు గేటు(ఫార్మసిటీ రోడ్డు) వద్ద ఏర్పాటు చేసిన అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని రేపు సబితాంద్రారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు జడ్పీటీసీ జంగారెడ్డి, బీఆర్‌ఎస్ మండల శాఖ అఽధ్యక్షుడు మన్నె జయేందర్‌ముదిరాజ్‌లు తెలిపారు. బుధవారం ఏఎంసీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ డి.చంద్రశేఖర్‌లతో కలిసి మండల కేంద్రంలో వారు మాట్లాడారు. శుక్రవారం ఉదయం 10గంటలకు విగ్రహం ఆవిష్కరించి, మండల కేంద్రం వరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. సామ నర్సింహరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
Updated Date - Dec 28 , 2023 | 12:27 AM