సీఎం రేవంత్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:28 PM
సీఎం రేవంత్‌రెడ్డిని సోమవారం టీపీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తాండ్ర సాయిరెడ్డి, చొక్కన్నపల్లి వెంకట్‌రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆమనగల్లు, డిసెంబరు 18: సీఎం రేవంత్‌రెడ్డిని సోమవారం టీపీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తాండ్ర సాయిరెడ్డి, చొక్కన్నపల్లి వెంకట్‌రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని సీఎం రేవంత్‌ను కోరగా సానుకూలంగా స్పందించినట్లు రాంరెడ్డి పేర్కొన్నారు. సీఎంను కలిసిన వారిలో ఆశాదీ్‌పరెడ్డి, జావేద్, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొన్నంను కలిసిన జంగారెడ్డి
కందుకూరు, డిసెంబరు 18 : రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్‌ను సోమవారం పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీ ఫ్లోర్‌లీడర్ ఏనుగు జంగారెడ్డి కలిసి ఘనంగా సన్మానించారు. నగరంలోని మంత్రి నివాసానికి వెళ్లిన ఆయన మహేశ్వరం నియోజకరవర్గం ప్రజలకు ఆర్టీసీ సౌకర్యం మరింత మెరుగు పర్చాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, కె.మధన్‌పాల్‌రెడ్డి, జగదీ్‌షబాబు, దిలీ్‌పరెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
సబితారెడ్డిని కలిసిన మీర్కాన్‌పేట సర్పంచ్, ఎంపీటీసీ
కందుకూరు, డిసెంబరు 18 : మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంర్రెడ్డిని సోమవారం మండలంలోని మీర్కాన్‌పేట సర్పంచ్ బి.జ్యోతీచంద్రశేఖర్, ఎంపీటీసీ కాకి రాములు మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని సబితాఇంద్రారెడ్డి నివాసానికి పలువురు గ్రామస్తులతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా సబితారెడ్డి విజయం కోసం గ్రామ, మండల స్థాయిలో చేసిన ప్రచారాన్ని వారు గుర్తుచేసుకున్నారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో సబితారెడ్డికి మీర్కాన్‌పేట ఓటర్లు అత్యధిక మెజారిటీ ఇచ్చారని, వారు చూపిన ఆదరణను తాను ఎప్పటికీ మరువలేనని సబితాఇంద్రారెడ్డి చెప్పినట్లు సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఇ.సత్తయ్య, శివప్రసాద్‌చారి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 11:28 PM